ఓపికున్నంతకాలం పనిచేస్తా..

  పెద్ద వయసులో ఉన్నవారు మామూలుగా లేచి తిరగడానికి ఎంత కష్టపడతారో చూస్తూనే ఉంటాం. అయితే బెంగళూర్‌లోని మానసిక విద్యార్థుల పాఠశాలలో లక్ష్మి కళ్యాణ్ సుందరం అనే 91ఏళ్ల బామ్మ టీచర్‌గా పని చేస్తోంది. ఈ వయసులో కూడా ఉద్యోగం ఎలా చేయగలుగుతున్నారని ఎవరైనా అడిగితే…“నేనెప్పుడూ పని చేయలేదు, నాశక్తి అంతా నాలోనే ఉంది” అంటూ నవ్వుతూ సమాధానమిస్తోంది. ఆమె భర్త చనిపోయాక 67వ ఏట స్కూల్లో టీచర్‌గా చేరిందీమె. పెళ్లైనప్పట్నించి ఇంట్లోనే ఉండేది. భర్త జ్ఞాపకాల్లోంచి […] The post ఓపికున్నంతకాలం పనిచేస్తా.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పెద్ద వయసులో ఉన్నవారు మామూలుగా లేచి తిరగడానికి ఎంత కష్టపడతారో చూస్తూనే ఉంటాం. అయితే బెంగళూర్‌లోని మానసిక విద్యార్థుల పాఠశాలలో లక్ష్మి కళ్యాణ్ సుందరం అనే 91ఏళ్ల బామ్మ టీచర్‌గా పని చేస్తోంది. ఈ వయసులో కూడా ఉద్యోగం ఎలా చేయగలుగుతున్నారని ఎవరైనా అడిగితే…“నేనెప్పుడూ పని చేయలేదు, నాశక్తి అంతా నాలోనే ఉంది” అంటూ నవ్వుతూ సమాధానమిస్తోంది. ఆమె భర్త చనిపోయాక 67వ ఏట స్కూల్లో టీచర్‌గా చేరిందీమె. పెళ్లైనప్పట్నించి ఇంట్లోనే ఉండేది. భర్త జ్ఞాపకాల్లోంచి బయటపడేందుకు ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలనుకుంది. స్వయంశక్తితో నిలబడేందుకు వయసు అడ్డం కాదంటోంది. ఓపిక ఉన్నంత కాలం ఈ ఉద్యోగమే తనకు తోడుగా ఉంటుందని చెబుతోంది. ఈ బామ్మకు ముగ్గురు ఆడపిల్లలు, ఐదుగురు మనవరాళ్లు, ఇద్దరు మనువళ్లు.

91yearold Grandma works as Teacher

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఓపికున్నంతకాలం పనిచేస్తా.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: