అందరికీ అందాలి

  నేప్కిన్ల విషయంలో ఇప్పటికీ కొరత ఉంటూనే ఉంది. మారుమూల గ్రామాల్లో నివసించే అమ్మాయిలు పేదరికం వల్ల నేప్కిన్లు కొనలేక ఇబ్బంది పడుతున్నారు. నేప్కిన్లు చవగ్గా లభించేవి కావు. అంత ధర పెట్టి కొనే స్థోమత లేనివారే ఎక్కువ. శానిటరీ నాప్కిన్లంటే తెలియని మహిళలు కూడా ఉన్నారంటే ఆశ్చర్యపోకమానం. చాలామంది గుడ్డల్ని వాడుతుండటం వల్ల, నెలసరి పరిశుభ్రత పాటించక అనారోగ్యానికి గురవుతున్నారు. ప్లాస్టిక్‌తో తయారు చేసిన నేప్కిన్లు కూడా ఆరోగ్యంతోపాటు పర్యావరణానికీ ముప్పే. ఈ సమస్యకు చెక్ […] The post అందరికీ అందాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నేప్కిన్ల విషయంలో ఇప్పటికీ కొరత ఉంటూనే ఉంది. మారుమూల గ్రామాల్లో నివసించే అమ్మాయిలు పేదరికం వల్ల నేప్కిన్లు కొనలేక ఇబ్బంది పడుతున్నారు. నేప్కిన్లు చవగ్గా లభించేవి కావు. అంత ధర పెట్టి కొనే స్థోమత లేనివారే ఎక్కువ. శానిటరీ నాప్కిన్లంటే తెలియని మహిళలు కూడా ఉన్నారంటే ఆశ్చర్యపోకమానం. చాలామంది గుడ్డల్ని వాడుతుండటం వల్ల, నెలసరి పరిశుభ్రత పాటించక అనారోగ్యానికి గురవుతున్నారు. ప్లాస్టిక్‌తో తయారు చేసిన నేప్కిన్లు కూడా ఆరోగ్యంతోపాటు పర్యావరణానికీ ముప్పే. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కొన్ని సంస్థలు, అమ్మాయిలు తమ వంతు సేవ చేస్తున్నారు. విజయం సాధిస్తూ మిగతావారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

పేద బాలికల కోసం పోరాటం…
ఖరీదైన నేప్కిన్లు కొనుగోలు చేయలేని పేద బాలికలకు ప్యాడ్‌లను ఉచితంగా అందజేసేలా చేసింది 20 ఏళ్ల అమికాజార్జ్. ఈమె మన భారతీయ మూలాలు ఉన్న అమ్మాయే. బ్రిటన్‌లో నిరుపేద బాలికలు నెలసరి సమయంలో వార్తాపత్రికలు, టాయ్‌లెట్ రోల్, సాక్సులని వాడటం గమనించిన అమికా ఆశ్చర్యపోయింది. వారి కోసం ఏమైనా చేయాలనుకుంది. తనవంతుగా పాఠశాలలు, మురికివాడల్లో అమ్మాయిలకు నేప్కిన్లు, నెలసరికి వినియోగించే కప్స్ పంపిణీ చేసింది. నేప్కిన్లు లేక బడి మానేసే పిల్లల సంఖ్య పెరగడాన్ని గమనించింది.

దీంతో ప్రభుత్వ సాయం అందితే తప్ప దీనికి పరిష్కారం దొరకదనుకుంది. కోర్టులో కేసు దాఖలు చేసి, పోరాటం మొదలుపెట్టింది. అమికా ప్రచార ప్రభావం, న్యాయస్థానం ద్వారా ఆమె చేసిన పోరాటానికి ఇంగ్లండ్ ప్రభుత్వం దిగొచ్చింది. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇంగ్లండ్, వేల్స్ ప్రాంతాల్లో ఈ నెల మొదటి వారం నుంచి ఉచిత న్యాప్కిన్లను ప్రభుత్వం అందిస్తోంది. అమికా జార్జ్ చేసిన సేవకుగాను ’గోల్ కీపర్స్ గ్లోబల్ గోల్స్’ అవార్డు వరించింది.

మొదటి సింథటిక్ ప్యాడ్ రహిత గ్రామంగా…
ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించింది. అశోక్ ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ ఎన్విరాన్‌మెంట్ అనే సంస్థ. మహిళల ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు చేసేలా ’ముహమ్మోదయం’ అనే ప్రాజెక్టును చేపట్టింది. బెంగళూరులోని వెంబనాడ్ పరిసర ప్రాంతాలను మూడేళ్లలో ప్లాస్టిక్ నాప్కిన్ల రహితంగా చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీనిలో భాగంగా ఇటీవల కేరళలోని మహమ్మా గ్రామంలో సుమారుగా అయిదు వేల గుడ్డ ప్యాడ్, మెన్‌స్ట్రువల్ కప్‌లను ఉచితంగా పంపిణీ చేసింది. వీటిని ఎలా వాడాలో కూడా అవగాహన కలిగించింది. ఇందులో ఒక శానిటరీ కప్‌ను అయిదేళ్ల వరకు ఉపయోగించొచ్చు. క్లాత్‌ప్యాడ్ నాలుగేళ్ల వరకు మన్నికగా ఉంటుంది. మహమ్మాను దేశంలో మొదటి సింథటిక్ ప్యాడ్ రహిత గ్రామంగా మార్చిందీ సంస్థ.

Amika Jarj provided pads for poor girls for free

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అందరికీ అందాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.