సమయాన్ని తెలిపే బ్రేస్‌లెట్స్

  ఈ రోజుల్లో ప్రతి అలంకరణ వస్తువునీ కొత్తగా, వెరైటీగా, రంగురంగుల డిజైన్లతో తయారు చేస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. ఒకప్పుడు చేతికి వాచీ ధరిస్తేనే ఫ్యాషన్. ఇప్పుడు చేతికి ఒక ట్రెండ్ వచ్చేసింది. మణికట్టు మెరిసేలా బ్యాండ్లూ, బ్రేస్‌లెట్లూ రకరకాల గ్యాడ్జెట్లూ.. ఇలా ప్రతిదీ అలంకరణలలో భాగమై పోతుంది. అప్పటి ఫ్యాషన్‌ని ఇప్పటి ట్రెండ్‌తో సీక్రెట్‌గా ముడిపెట్టేస్తూ తయారవుతున్నవే సీక్రెట్ వాచీ బ్రేస్‌లెట్లు. చూడడానికి బ్రేస్‌లెట్‌లా కనిపిస్తూ లోపల వాచీ దాగి ఉండటమే వీటి ప్రత్యేకత. కాలేజీ […] The post సమయాన్ని తెలిపే బ్రేస్‌లెట్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఈ రోజుల్లో ప్రతి అలంకరణ వస్తువునీ కొత్తగా, వెరైటీగా, రంగురంగుల డిజైన్లతో తయారు చేస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. ఒకప్పుడు చేతికి వాచీ ధరిస్తేనే ఫ్యాషన్. ఇప్పుడు చేతికి ఒక ట్రెండ్ వచ్చేసింది. మణికట్టు మెరిసేలా బ్యాండ్లూ, బ్రేస్‌లెట్లూ రకరకాల గ్యాడ్జెట్లూ.. ఇలా ప్రతిదీ అలంకరణలలో భాగమై పోతుంది. అప్పటి ఫ్యాషన్‌ని ఇప్పటి ట్రెండ్‌తో సీక్రెట్‌గా ముడిపెట్టేస్తూ తయారవుతున్నవే సీక్రెట్ వాచీ బ్రేస్‌లెట్లు. చూడడానికి బ్రేస్‌లెట్‌లా కనిపిస్తూ లోపల వాచీ దాగి ఉండటమే వీటి ప్రత్యేకత.
కాలేజీ అమ్మాయిల దగ్గర్నుంచీ కార్పొరేట్ ఉద్యోగినుల వరకూ చుడిదార్లు, గాగ్రాల వంటి సంప్రదాయ దుస్తులు వేసినప్పుడు గాజులూ బ్రేస్‌లెట్లతో ముస్తాబైనా, టాప్‌లూ షర్టుల విషయానికి వచ్చేసరికి చేతికి వాచీ ఉండాల్సిందే.

నచ్చిన వాచీని మెచ్చిన బ్రేస్‌లెట్‌తో సీక్రెట్‌గా జతచేసేసి మరో కొత్త ఫ్యాషన్‌కి తెరతీస్తున్నారు నేటి ఫ్యాషన్ మాస్టర్లు. మామూలుగా చూసేవారికి చేతికి కేవలం బ్రేస్‌లెట్ పెట్టుకున్నట్టే అనిపిస్తుంది. బ్రేస్‌లెట్ మీద ఉన్న డిజైన్‌ని పక్కకు జరిపినా లేదా బ్రేస్‌లెట్‌కి జతచేసి ఉండే పిన్‌ని నొక్కినా అందులోని వాచీ బయటకు వస్తుంది. కావాలనుకుంటే అలాగే చేతికి ఉంచేసుకోవచ్చు. లేదంటే వాచీని లోపలికి తోసేయొచ్చు. పచ్చలూ కెంపులూ… ఇలా ఖరీదైన రంగురాళ్లను అద్దుకుని అందంగా తయారవుతున్న ఈ బ్రేస్‌లెట్లు ఎంత నిండుగా ఉంటాయో అంతే ట్రెండీగానూ కనిపిస్తాయి. ఆన్‌లైన్‌లో తెప్పించుకోవచ్చు వీటిని.

Find time with bracelets

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సమయాన్ని తెలిపే బ్రేస్‌లెట్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.