పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య

స్కూల్ వద్ద విద్యార్థి బంధువులు, గ్రామస్థుల ఆందోళన బూర్గంపహాడ్: పాఠశాల మరుగుదొడ్డిలో ఓ విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం, సారపాక ఎంఆర్‌ఆర్ పబ్లిక్ స్కూల్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. కటికల చిట్టిబాబు, లక్ష్మి దంపతుల చిన్న కుమారుడు తేజ (15). ఈ బాలుడు సారపాక ఎంఆర్‌ఆర్ పబ్లిక్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. ఉదయం స్కూల్‌కి వెళ్లిన తేజ పాఠశాల మరుగుదొడ్డిలో ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి మరణ వార్త […] The post పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
స్కూల్ వద్ద విద్యార్థి బంధువులు, గ్రామస్థుల ఆందోళన

బూర్గంపహాడ్: పాఠశాల మరుగుదొడ్డిలో ఓ విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం, సారపాక ఎంఆర్‌ఆర్ పబ్లిక్ స్కూల్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. కటికల చిట్టిబాబు, లక్ష్మి దంపతుల చిన్న కుమారుడు తేజ (15). ఈ బాలుడు సారపాక ఎంఆర్‌ఆర్ పబ్లిక్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. ఉదయం స్కూల్‌కి వెళ్లిన తేజ పాఠశాల మరుగుదొడ్డిలో ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి మరణ వార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు పాఠశాల యాజమాన్యంపై దాడికి ప్రయత్నించారు. దీంతో పాఠశాల సిబ్బంది పారిపోయారు. హెచ్‌ఎం గదిలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. విద్యార్థి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Student Suicide in School At khammam district

The post పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: