వణికిస్తున్న కరోనా వైరస్

  హైదరాబాద్: చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ పట్ల జిల్లా వైద్య ఆరోగ్య అప్రమత్తమైంది. చైనా నుంచి రాష్ట్రానికి వచ్చే వారిపై నిఘా పెట్టి వారికి ఏమాత్రం వైరస్ లక్షణాలున్నా వైద్య పరీక్షలు చేసి పంపిస్తున్నారు. దీనిలో భాగంగా గాంధీ ఆసుపత్రితో పాటు నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలోని 7వ వార్డులను (ఐసోలేటెడ్) కరోనా అనుమానిత కేసుల కోసం సిద్దం చేశారు. అయితే నగరంలో ముగ్గురికి కరోనా వైరస్ సోకినట్లుగా అనుమానించి వారి నుంచి శాంప్లిను సేకరించి పుణేలోని […] The post వణికిస్తున్న కరోనా వైరస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ పట్ల జిల్లా వైద్య ఆరోగ్య అప్రమత్తమైంది. చైనా నుంచి రాష్ట్రానికి వచ్చే వారిపై నిఘా పెట్టి వారికి ఏమాత్రం వైరస్ లక్షణాలున్నా వైద్య పరీక్షలు చేసి పంపిస్తున్నారు. దీనిలో భాగంగా గాంధీ ఆసుపత్రితో పాటు నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలోని 7వ వార్డులను (ఐసోలేటెడ్) కరోనా అనుమానిత కేసుల కోసం సిద్దం చేశారు. అయితే నగరంలో ముగ్గురికి కరోనా వైరస్ సోకినట్లుగా అనుమానించి వారి నుంచి శాంప్లిను సేకరించి పుణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. జూబ్లీహిల్స్‌కు చెందిన అమర్‌నాథ్‌రెడ్డి (25) ఇటీవల చైనా నుంచి నగరానికి వచ్చాడు.

అనంతరం అస్వస్దతకు గురికావడంతో అతని శనివారం రాత్రి ఫీవర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు అతని పరీక్షించి అనుమానిత కరోనా కేసుగా పరిగణించారు. ఐసోలేటెడ్ వార్డులో అతడిని ఇన్‌పేషెంట్‌గా చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. ఆదివారం మరో రెండు అనుమానిత కేసులు వచ్చాయి. ఈముగ్గురిని ఐసోలేటెడ్ వార్డులో ఉంచి అందిస్తున్నారు. వారి నుంచి శాంపిల్స్ సేకరించి పుణే ల్యాబ్‌కు పంపామని ఆసుపత్రి ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. వీరికంటే ముందు పదిరోజుల కితం చైనా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓవిద్యార్ది దగ్గు, జలుబుతో అస్వస్దతకు గురయ్యాడు. కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో ఆవిద్యార్ది ఫీవర్ ఆసుపత్రికి రాగా వైద్యపరీక్షల్లో సాధారణ ప్లూగా తేలింది. అతడిని చికిత్స చేసి ఆసుపత్రి నుంచి ఇటీవలే డిశ్చార్జి చేశారు.

వ్యాధి లక్షణాలు: ముక్కుకారడం, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నలతగా అనిపించడం ఉంటుంది. వ్యాధి తీవ్రమైనప్పుడు చాతీలో నొప్పి, చలి, జ్వరం, గుండె వేగం పెరగడం, నిమోనియో, మూత్ర పిండాల వైఫల్యం.

ఆ నలుగురి కరోనా వైరస్ సోకలేదు: ఫీవర్ ఆసుపత్రి
నగరంలో కరోనా వైరస్ కలకలం సృష్టిసోందన్నే మాటలకు నగర ప్రజలు తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. ఆదివారం చైనా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన నలుగురు వ్యక్తులు కరోనా వ్యాధి లక్షణాలతో నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో చేరారు. అయితే ఈనలుగురికి ఆవ్యాధి లక్షణాలు లేవని ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.శంకర్ స్పష్టం చేశారు. ఈనలుగురి ప్రత్యేక వార్డులో ఉంచి పరీక్షించామని, వారికి జ్వరం, గొంతునొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు లేవని చెప్పారు.

హైదరాబాద్‌లో కేంద్ర వైద్య బృందం పర్యటన: కేంద్ర వైద్య బృందం నగరంలో పర్యటించింది. ఫీవర్,గాంధీ ఆసుపత్రుల్లో పరిశీలించారు. కరోనా అనుమానితులకు అందించిన చికిత్స, చేపట్టిన చర్యలను వైద్యులతో చర్చించారు. కరోనా సోకిన రోగుల వార్డులు ఎలా ఉండాలి అనే దానిపై వైద్యులకు సూచించారు. గాందీ, పీవర్ ఆసుపత్రుల వైద్యులకు కేంద్ర బృందం సూచనలు చేశారు.

Coronavirus blood tests at Fever Hospital

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వణికిస్తున్న కరోనా వైరస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: