దేశానికే ఆదర్శవంతమైన పట్టణాలను తీర్చిదిద్దుతాం

  హైదరాబాద్:127 మున్సిపాలిటీల్లో 119 మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుందని, ఇంతటి ఘన విజయం అందించిన ప్రజలందరికీ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ జేజేలు తెలిపారు. సోమవారం కార్పోరేషన్ ఫలితాలు వెల్లడించిన అనంతరం మంత్రి కెటిఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. పది కార్పొరేషన్లలోనూ తామే గెలుస్తామని.. కాంగ్రెస్‌కు 4, బిజెపికి 2, ఎంఐఎంకు 2 మున్సిపాలిటీలు మాత్రమే వచ్చాయన్నారు. టిఆర్ఎస్ పార్టీకి మరోసారి అండగా నిలిచిన పట్టణ ప్రజలందరికీ […] The post దేశానికే ఆదర్శవంతమైన పట్టణాలను తీర్చిదిద్దుతాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్:127 మున్సిపాలిటీల్లో 119 మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుందని, ఇంతటి ఘన విజయం అందించిన ప్రజలందరికీ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ జేజేలు తెలిపారు. సోమవారం కార్పోరేషన్ ఫలితాలు వెల్లడించిన అనంతరం మంత్రి కెటిఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. పది కార్పొరేషన్లలోనూ తామే గెలుస్తామని.. కాంగ్రెస్‌కు 4, బిజెపికి 2, ఎంఐఎంకు 2 మున్సిపాలిటీలు మాత్రమే వచ్చాయన్నారు. టిఆర్ఎస్ పార్టీకి మరోసారి అండగా నిలిచిన పట్టణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని, మీకిచ్చిన హామీలన్నీ తు.చ. తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. దేశానికే ఆదర్శవంతమైన పట్టణాలను తీర్చిదిద్దుతామన్నారు. త్వరలోనే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపడుతామని తెలిపారు. పార్టీలకతీతంగా కొత్తగా ఎన్నికైన అభ్యర్థులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అర్బన్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీని కూడా ఏర్పాటు చేస్తామని, కేంద్రం మున్సిపాలిటీలకు రూ.1,037 కోట్లు వస్తే అంతే మొత్తం రాష్ట్రం నుంచి కేటాయించి మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్, బిజెపి రెండు జాతీయ పార్టీలు కలిసి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని, కాంగ్రెస్, బిజెపిలు పేరుకే ఢిల్లీ పార్టీలని.. చేసేవి మాత్రం గల్లీ రాజకీయాలని మంత్రి కెటిఆర్ విమర్శించారు.

Minister KTR Press Meet at Telangana Bhavan

The post దేశానికే ఆదర్శవంతమైన పట్టణాలను తీర్చిదిద్దుతాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: