రాజ్యాంగ ప్రతిని తిరస్కరించిన ప్రధాని కార్యాలయం

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై(సిఎఎ) కాంగ్రెస్, బిజెపి మధ్య తలెత్తిన విభేదాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా సిఎఎకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్న నేపథ్యంలో భారత రాజ్యాంగాన్ని చదువుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీకి ఆన్‌లైన్‌లో రాజ్యాంగ ప్రతిని పంపించగా దాన్ని తీసుకోవడానికి ప్రధాని కార్యాలయం నిరాకరించింది. అమెజాన్ ద్వారా పంపించిన రాజ్యాంగ ప్రతిని స్వీకరించడానికి ప్రధాని కార్యాలయం నిరాకరించడంతో అమెజాన్‌కు వాపసు చేసిన నోటిఫికేషన్‌ను కాంగ్రెస్ సోమవారం ట్విటర్‌లో షేర్ చేసింది. […] The post రాజ్యాంగ ప్రతిని తిరస్కరించిన ప్రధాని కార్యాలయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై(సిఎఎ) కాంగ్రెస్, బిజెపి మధ్య తలెత్తిన విభేదాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా సిఎఎకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్న నేపథ్యంలో భారత రాజ్యాంగాన్ని చదువుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీకి ఆన్‌లైన్‌లో రాజ్యాంగ ప్రతిని పంపించగా దాన్ని తీసుకోవడానికి ప్రధాని కార్యాలయం నిరాకరించింది. అమెజాన్ ద్వారా పంపించిన రాజ్యాంగ ప్రతిని స్వీకరించడానికి ప్రధాని కార్యాలయం నిరాకరించడంతో అమెజాన్‌కు వాపసు చేసిన నోటిఫికేషన్‌ను కాంగ్రెస్ సోమవారం ట్విటర్‌లో షేర్ చేసింది.

ప్రియమైన భారతదేశ ప్రజలారా..మేము ప్రయత్నించినప్పటికీ రాజ్యాంగంపై మోడీజీకి ఆసక్తి ఉన్నట్లుగా లేదు. ఇప్పుడేం చేద్దాం అంటూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. శనివారం కాంగ్రెస్ పార్టీ అమెజాన్ ద్వారా భారత రాజ్యాంగ ప్రతిని ప్రధాని మోడీకి ఆన్‌లైన్‌లో బుక్ చేసింది. ఆర్డర్ ఖరారైందని ప్రధానికి తెలియచేస్తూ ..అతి త్వరలో రాజ్యాంగం ప్రతి మీకు అందుతుంది. దేశాన్ని చీల్చే పనిలో ఉన్న మీరు కాస్త తీరిక దొరికనపుడు దయచేసి దీన్ని చదవండి.. అంటూ కాంగ్రెస్ శనివారం ట్వీట్ చేసింది.

PMO rejects Constitution Copy delivery, Congress has sent a copy of Indian Constitution copy through Amazon to PM Narendra Modi

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రాజ్యాంగ ప్రతిని తిరస్కరించిన ప్రధాని కార్యాలయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: