ముగిసిన కెటిఆర్ దావోస్ పర్యటన

  హైదరాబాద్: వరల్డ్ ఎకనామిక్ ఫోరం కోసం దావోస్‌లో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు పర్యటన విజయవంతంగా ముగిసింది. జనవరి 19వ తేదీన దావోస్‌కు వెళ్ళిన ఆయన శనివారం తెల్లవారు జామున తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ పర్యటనలో మంత్రి కెటిఆర్ అనేక ప్రముఖ కంపెనీల సీనియర్ ప్రతినిధులతో పాటు వివిధ దేశాలకు సంబంధించిన మంత్రులను కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించి స్థానికంగా […] The post ముగిసిన కెటిఆర్ దావోస్ పర్యటన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: వరల్డ్ ఎకనామిక్ ఫోరం కోసం దావోస్‌లో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు పర్యటన విజయవంతంగా ముగిసింది. జనవరి 19వ తేదీన దావోస్‌కు వెళ్ళిన ఆయన శనివారం తెల్లవారు జామున తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ పర్యటనలో మంత్రి కెటిఆర్ అనేక ప్రముఖ కంపెనీల సీనియర్ ప్రతినిధులతో పాటు వివిధ దేశాలకు సంబంధించిన మంత్రులను కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించి స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచే లక్ష్యంతో జరిగిన దావోస్ పర్యటన విజయవంతమైంది. గత నాలుగు రోజులుగా ఈ మేరకు దావోస్‌లో పర్యటించిన మంత్రి కెటిఆర్ సుమారు 50కి పైగా ముఖాముఖి సమావేశాలతో పాటు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన 5 చర్చ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఆల్ఫాబెట్, గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్, కోక కోల సిఇఒ జేమ్స్ క్వేన్సీ , సేల్స్ ఫోర్స్ స్థాపకుడు చైర్మన్ మార్క్ బెనియాఫ్, యూట్యూబ్ సిఐఒ సుసాన్ వొజ్కికి లాంటి కార్పొరేట్ దిగ్గజాలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రగతిశీల విధానాలతో పాటు పారిశ్రామిక పాలసీని, స్థానికంగా ఉన్న పెట్టుబడి అవకాశాలను, వివిధ పరిశ్రమలకు ఇక్కడ అందుబాటులో ఉన్న వనరులను పరిచయం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులలో అగ్రస్థానంలో నిలుస్తున్న అంశాన్ని కూడా ప్రస్తావించారు. గత ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్ నగరం శీఘ్రగతిన అభివృద్ధి చెందుతున్న తీరుని కూడా మంత్రి వివరించారు. హైదరాబాద్ నగరం కాస్మోపాలిటన్ కల్చర్‌తో పాటు గత కొన్ని సంవత్సరాలుగా జీవించేందుకు అనువుగా ఉన్న నగరాల్లో అత్యుత్తమ నగరంగా ఎంపిక అవుతున్న విషయాన్ని కూడా వివరించారు.

దావోస్ పర్యటన ద్వారా పిరమల్ గ్రూప్‌కి సంబంధించిన రూ.500 కోట్ల పెట్టుబడితో పాటు అనేక ఇతర కంపెనీలు తెలంగాణ పట్ల ఆసక్తి వ్యక్తం చేసేలా దావోస్ పర్యటన విజయవంతమైంది. వరల్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పెవిలియన్ ని ఏర్పాటు చేసింది. భారతదేశం నుంచి మధ్యప్రదేశ్ కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాలు కూడా పాల్గొన్నప్పటికీ తెలంగాణ భారీ ఎత్తున సొంత రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాగలిగింది. మంత్రి కెటిఆర్ ప్రతినిధి బృందంలో ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తోపాటు డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొనతం, టి హబ్ సిఇఒ రవి నారాయన్ తదితరులు ఉన్నారు.

Minister KTR successful trip to Davos concludes

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ముగిసిన కెటిఆర్ దావోస్ పర్యటన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: