ఆడపిల్ల పుడితే అదనంగా రూ. వెయ్యి

  ఈచ్ వన్ టీచ్ వన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : మంత్రి సత్యవతి రాథోడ్ మనతెలంగాణ/హైదరాబాద్: జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ ఆడ పిల్ల పుట్టిన వారికి అదనంగా రూ.1,000ల నజరాను మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ మేరకు గురువారం దామోదర్ సంజీవయ్య భవన్‌లో రాష్ట్ర బాలల హక్కుల ప్రజా వేదిక రూపొందించిన జాతీయ బాలికా దినోత్సవ పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ […] The post ఆడపిల్ల పుడితే అదనంగా రూ. వెయ్యి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఈచ్ వన్ టీచ్ వన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : మంత్రి సత్యవతి రాథోడ్

మనతెలంగాణ/హైదరాబాద్: జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ ఆడ పిల్ల పుట్టిన వారికి అదనంగా రూ.1,000ల నజరాను మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ మేరకు గురువారం దామోదర్ సంజీవయ్య భవన్‌లో రాష్ట్ర బాలల హక్కుల ప్రజా వేదిక రూపొందించిన జాతీయ బాలికా దినోత్సవ పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్త్రీలను దేవతలుగా పూజించే భారతీయ సమాజంలో మహిళా రక్షణ కోసం అందరూ పాటు పడాలని కోరారు. సిఎంకెసిఆర్ హయంలో తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమం, సంరక్షణ, భద్రతకు పెద్దపీట వేస్తుందన్నారు. ఇందులో భాగంగా దేశంలో ఎక్కడ లేని విధం గా విస్తృతంగా షీటీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు.

బాల్యవివాహాలను నివారించేందుకు కళ్యాణ లక్ష్మీపథకం సమర్ధవంతంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని అంగన్ వాడీ కేంద్రాల ద్వారా బాల,బాలికలకు ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా విస్తృతంగా పౌష్టికాహారం అందిస్తున్నామని వివరించారు. గర్భం ధరించిన మహిళలకు ఆరు మాసాల నుంచే నెలకు రూ.2,000లను చోప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఆడపిల్ల పుట్టిన వారికి అదనంగా రూ.1,000 కలిపి, ఇక నుంచి రూ.13వేలను మంజూరు చేస్తామని మంత్రి వెల్లడించారు.

నేటి ఆధునిక సమాజంలో లింగ వివక్షత రూపు మాపేందుకు బాలిక విద్యా, వికాసానికి కృషి చేయాలని సూచించారు. సిఎంకెసిఆర్ ప్రకటించిన ఈచ్ వన్ టీచ్‌వన్ కార్యక్రమంలో మహిళలు ముందు ఉండి, నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి చేయాలని మంత్రి పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి ఫారుఖ్ హుస్సేన్, బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు సుభాష్ చంద్రబోస్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పిడిశెట్టి రాజు, రాష్ట్ర దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి టి. శంకర్, మహిళాచైర్మన్ జయంతి, వికలాంగుల మహిళా, సాధికార సంఘం అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి,దళిత బహుజన ఫ్రంట్ మహిళా కన్వీనర్ సంగీతా, బాలల హక్కుల ప్రజా వేదిక హైదరాబాద్ నగర కన్వీనర్ పొన్నాల బాబు, సావిత్రిబాయి పూలే మహిళా సంఘం అధ్యక్షురాలు బెల్లం మాధవి తదితరులు పాల్గొన్నారు.

Eech One Teach One program must be successful

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆడపిల్ల పుడితే అదనంగా రూ. వెయ్యి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: