సమాచార గోప్యత మానవ హక్కు

  ఉపయోగిస్తున్న డాటా సమాజ హితానికి తోడ్పడాలి మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్య నాదెళ్ల దావోస్: సమాచార గోప్యతను మానవ హక్కుగా చూడాలని, దీన్ని కాపాడాల్సిన, పూర్తి పారదర్శకత ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ల అభిప్రాయ పడ్డారు. ఇక్కడ జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు(డబ్లు ఇఎఫ్)లో సత్య నాదెళ్ల మాట్లాడుతూ వ్యక్తుల అనుమతితో భారీ ఎత్తున ఉపయోగిస్తున్న డాటా సమాజ హితానికి దోహదపడేలా ఉండే విధంగా చూడాల్సిన అవసరం కూడా ఉందని ఆయన […] The post సమాచార గోప్యత మానవ హక్కు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఉపయోగిస్తున్న డాటా సమాజ హితానికి తోడ్పడాలి
మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్య నాదెళ్ల

దావోస్: సమాచార గోప్యతను మానవ హక్కుగా చూడాలని, దీన్ని కాపాడాల్సిన, పూర్తి పారదర్శకత ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ల అభిప్రాయ పడ్డారు. ఇక్కడ జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు(డబ్లు ఇఎఫ్)లో సత్య నాదెళ్ల మాట్లాడుతూ వ్యక్తుల అనుమతితో భారీ ఎత్తున ఉపయోగిస్తున్న డాటా సమాజ హితానికి దోహదపడేలా ఉండే విధంగా చూడాల్సిన అవసరం కూడా ఉందని ఆయన అన్నారు. అంతేకాకుండా సిఇఓల వేతనాలు, పెట్టుబడిపై రాబడి సహా అన్ని రకాల రెమ్యూనరేషన్లపైనా చర్చ జరగాలని డబ్లు ఇఎఫ్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ క్లాస్ ష్వాబ్‌తో సంభాషణ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు.

మంచి చేయడంతో పాటు అదే సమయంలో ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీలో మంచిగా ఉండడంపై మీ నిర్వచనం ఏమిటని అడగ్గా, అదే వ్యాపార కీలక సూత్రమని సత్య నాదెళ్ల అన్నారు. మనం మంచిగా ఉంటే మన చుట్టూ ఉండే సమాజం కూడా మంచిగా ఉంటుందన్నారు. ‘ప్రజలు, వ్యవస్థలు మన సమాజంలో భాగం. మనం విస్తృతమైన వ్యవస్థలు గురించి ఆలోచించనపుడు అది స్థిరంగా ఉండదు.అయితే చివరగా ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది, అదే మార్కెట్ ఏం చెబుతుంది, సమాజం ఏం చెబుతుందనేది’ అని ఆయన అన్నారు.ఈ సందర్భంగా ఆయన ‘నారో కారిడార్’ పుస్తకం గురించి ప్రస్తావిస్తూ, ఏది పని చేస్తుందో అలోచించాలని అన్నారు. అప్పుడే ఎవరూ నష్టపోరు.

వాటాదారుల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భాగస్వాములు మంచి పనులు చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ దశాబ్దంలో అందరూ కలిసి కట్టుగా సాధించాల్సిన అంశాలు నాలుగు ఉన్నాయని, అవి ఒకదానితో ఒకటి అనుసంధానమైనవని సత్య నాదెళ్ల అన్నారు. టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించడం ద్వారా విస్తృత ఆర్థిక వృద్ధికి శక్తిని చేకూర్చడం, ఈ ఆర్థిక వృద్ధి అన్ని వర్గాలకు అందేలా చూడడం, సాంకేతికత, దాని వినియోగంపై విశ్వాసాన్ని కల్పించడం, నిలకడైన భవిష్యత్తుకు కట్టుబడి ఉండడం అనేవే ఈ నాలుగు అంశాలని మైక్రోసాఫ్ట్ సిఇఓ అన్నారు.

Data privacy must be seen as human right

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సమాచార గోప్యత మానవ హక్కు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: