లేబర్, మార్కెటింగే సమస్యలు

  వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ, ప్రాసెసింగ్, స్టోరేజీ, ఎగుమతులను అభివృద్ధి చేయాలి ఇరిగేషన్ పెరగడంతో పంటలు సమృద్ధిగా పండుతున్నాయి నాబార్డ్ సభలో ఆర్థిక మంత్రి హరీష్‌రావు మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయం చేయడానికి లేబర్ అలాగే పండించిన ఉత్పత్తులకు ఇప్పుడు మార్కెటింగ్ పెద్ద సవాల్‌గా మారిందని ఆర్థికశాఖ మంత్రి టి.హరీష్‌రా వు అన్నారు. అందువల్ల యాంత్రీకరణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్, స్టోరేజి, ఎగుమతి రంగాల ను అభివృద్ధి చేయాలన్నారు. రైతులకు యాంత్రీకరణ, ఇతర సాంకేతిక టెక్నాలజీపై బడ్జెట్ స మావేశాల్లో […] The post లేబర్, మార్కెటింగే సమస్యలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ, ప్రాసెసింగ్, స్టోరేజీ, ఎగుమతులను అభివృద్ధి చేయాలి

ఇరిగేషన్ పెరగడంతో పంటలు సమృద్ధిగా పండుతున్నాయి
నాబార్డ్ సభలో ఆర్థిక మంత్రి హరీష్‌రావు

మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయం చేయడానికి లేబర్ అలాగే పండించిన ఉత్పత్తులకు ఇప్పుడు మార్కెటింగ్ పెద్ద సవాల్‌గా మారిందని ఆర్థికశాఖ మంత్రి టి.హరీష్‌రా వు అన్నారు. అందువల్ల యాంత్రీకరణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్, స్టోరేజి, ఎగుమతి రంగాల ను అభివృద్ధి చేయాలన్నారు. రైతులకు యాంత్రీకరణ, ఇతర సాంకేతిక టెక్నాలజీపై బడ్జెట్ స మావేశాల్లో వెల్లడిస్తామన్నారు. సాగునీటి వనరులు పెరగడంతో పెద్ద ఎత్తున పంటలు పండుతున్నాయని, అయితే సమస్య మార్కెటింగ్ దగ్గర వస్తోందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాసెసింగ్ ద్వారానే అదనపు విలువ జోడించినట్లవుతుందన్నారు.

ఈ విధంగానే రైతు ఆదాయం రెట్టింపు అవుతుందన్నారు. 202021 రాష్ట్ర రు ణ ప్రణాళికకు సంబంధించిన ఫోకస్ పేపర్‌ను గురువారం మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం పంట రు ణాలకే పరిమితం కాకుండా, వ్యవసాయ అనుబ ంధ రంగాలకు కూడా విరివిగా రుణాలు ఇవ్వాలని ఆయన నాబార్డును, ఇతర బ్యాంకర్లను కో రారు. ఈ ఏడాది నాబార్డ్ హైటెక్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అయితే పంట రుణాల మాదిరి, యాంత్రీకరణ పనిముట్లకు కూడా వడ్డీ తగ్గింపు ఇవ్వాలని కో రారు. సిఎం కెసిఆర్ ఎంఎల్‌ఎ, ఎంపిగా, డిప్యూటి స్పీకర్‌గా, కేంద్రమంత్రిగా, ఇప్పుడు సిఎంగా ఉన్నా రైతుగా నిత్యం పని చేస్తారన్నారు.వ్యవసాయంచేసే రైతుకు ఒకప్పుడు గొప్ప గౌరవం లభించేందన్నారు. కారణాలు ఏవైనా వ్యవసాయ రంగం ప్రాధాన్యం కోల్పోయిందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కెసిఆర్ రైతుల సమస్యలపై దృష్టి సారించారన్నారు. తాను మార్కెటింగ్‌శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రూ. 1056 కోట్లతో గోదాముల నిర్మాణం చేపట్టామన్నారు.

బడ్జెట్ ప్రాధాన్యత వ్యవసాయానికే
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తుందనడానికి బడ్జెట్ కేటాయింపులే నిదర్శనమని హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వం బడ్జెట్ మొత్తంలో 30 శాతానికి పైగా వ్యవసాయ రంగానికే ఖర్చు చేస్తోందని తెలిపారు. రైతుబంధు కోసం రూ.12వేల కోట్లు, రైతుబీమా కోసం రూ. 1136 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ప్రాజెక్టుల కింద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలకు విద్యుత్ రాయితీకి రూ.8వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. దేశంలో మరే రాష్ట్రం రైతు కోసం ఇంత ఖర్చు చేయడం లేదన్నా రు. గతంలో రుణమాఫీ అమలు చేశామని, ఇప్పుడు కూడా అందుకోసం రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఇరిగేషన్ కోసం ఏటా రూ.25వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. దీంతో రైతుల్లో భరోసా ఏర్పడిందన్నారు. ఉన్నత చదువులు చదివినవారు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారన్నారు.

రైతుల రెవిన్యూ రికార్డులను 96 శాతం పరిష్కరించామని, మరో నాలుగు శాతం లీగల్ కేసులకు సం బంధించినవన్నారు. గొర్రెల పంపిణీ వల్ల వాటి నుంచి 80 లక్షల కొత్త గొర్రె పిల్లలు పుట్టాయన్నారు. మత్స్య సొసైటీలు దేశంలో అధికంగా తెలంగాణలోనే ఉన్నాయన్నారు దాదాపు 4400 సొసైటీలు ఉన్నాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 64 కోట్ల చేప పిల్లలను, 3.4 కోట్ల రొయ్య పిల్లలను నీటివనరుల్లో ఉచితంగా వేశామన్నారు. ఫిషరీస్‌లో దేశంలో కేరళ తర్వాత తెలంగాణ రెండో స్థానం లో ఉందన్నారు. ప్రాసెసింగ్ రంగంలో మనం వెనుకబడ్డామని హరీష్‌రావు అన్నారు. అందుకే మేడ్చల్ జిల్లా జీడిమెట్ల, సిద్ధిపేట జిల్లా ములుగులో ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టామన్నారు. ప్రతి జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలని సర్కారు ఆలోచిస్తుందన్నారు.

మరో ఐదు.. పదేళ్లలో కూలీలు దొరకరు
మరో ఐదు, పదేళ్ల తరువాత వరి నాట్లు వేసేందుకు కూ లీలు దొరక్కపోవచ్చునని హరీశ్‌రావు అన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాలన్నారు. పెద్ద రైతులకు ఉపయోగపడే యంత్రాలు కాకుండా, చిన్నసన్నకారు రైతులకు ఉపయోగపడేలా సాంకేతిక సహకారం అందించలన్నా రు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రాష్ట్ర అధికారులను జపాన్ సహా ఇతర దేశాలకు పంపి, అక్కడి వ్యవసాయ సాంకేతికతను పరిశీలించాలని సూచించారన్నారు. వరి నాట్లు, కలుపు తీసే యంత్రాల కోసం ప్రభుత్వం రాయితీ ఇస్తుందని, దీనికి బ్యాంకులు సహకరించాలని కోరారు.

నాబార్డు నిధుల వినియోగంలో తెలంగాణ దేశంలోనే ప్రథమస్థానంలో ఉందన్నారు. నాబార్డు ప్రణాళిక సమావేశాలను జిల్లాల్లో రైతుల మధ్య నిర్వహించాలన్నా రు. వారి అభిప్రాయాలను స్వీకరించాలన్నారు. వచ్చే ఏడాది కార్యాచరణ ప్రణాళికకు ఉత్తమ రైతులను ఆహ్వానించి వారి అభిప్రాయాలు సేకరించాలన్నారు. అప్పుడే చక్కటి ప్రణాళిక తయారవుతుందన్నారు. ఈ సమావేశంలో నాబార్డు సిజిఎం విజయ్‌కుమార్ పాల్గొన్నారు.

TRS Govt priority sector is agriculture, says Harish rao

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post లేబర్, మార్కెటింగే సమస్యలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: