ఎలాంటి చర్యలు తీసుకోవద్దు

  టెలికాం కంపెనీలపై డాట్ అధికారులకు ఆదేశాలు ఎజిఆర్ బకాయిల చెల్లింపుపై గడువు ముగిసిన నేపథ్యంలో ప్రకటన సుప్రీం కోర్టు తీర్పు వచ్చేంత వరకు వేచిచూడాలని నిర్ణయం న్యూఢిల్లీ: టెలికాం కంపెనీలకు ఎజిఆర్(సర్దుబాటు స్థూల ఆదాయం) బకాయిల చెల్లింపునకు గడువు తేదీ గురువారం(జనవరి 23) ముగిసింది. సుప్రీంకోర్టు ముందస్తు ఉత్తర్వు వచ్చేవరకు ఎజిఆర్ చెల్లించని సంస్థలపై చర్యలు తీసుకోవద్దని సంబంధిత విభాగాలన్నింటికీ ఆదేశాలు ఇచ్చినట్లు డాట్ లైసెన్సింగ్ ఫైనాన్స్ పాలసీ విభాగం తెలిపింది. ‘లైసెన్సింగ్ వింగ్ డైరెక్టర్ […] The post ఎలాంటి చర్యలు తీసుకోవద్దు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

టెలికాం కంపెనీలపై డాట్ అధికారులకు ఆదేశాలు
ఎజిఆర్ బకాయిల చెల్లింపుపై గడువు ముగిసిన నేపథ్యంలో ప్రకటన
సుప్రీం కోర్టు తీర్పు వచ్చేంత వరకు వేచిచూడాలని నిర్ణయం

న్యూఢిల్లీ: టెలికాం కంపెనీలకు ఎజిఆర్(సర్దుబాటు స్థూల ఆదాయం) బకాయిల చెల్లింపునకు గడువు తేదీ గురువారం(జనవరి 23) ముగిసింది. సుప్రీంకోర్టు ముందస్తు ఉత్తర్వు వచ్చేవరకు ఎజిఆర్ చెల్లించని సంస్థలపై చర్యలు తీసుకోవద్దని సంబంధిత విభాగాలన్నింటికీ ఆదేశాలు ఇచ్చినట్లు డాట్ లైసెన్సింగ్ ఫైనాన్స్ పాలసీ విభాగం తెలిపింది. ‘లైసెన్సింగ్ వింగ్ డైరెక్టర్ ఈ విషయంలో అన్ని విభాగాలకు సూచనలు ఇచ్చారు’ అని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆదాయానికి సంబంధించిన డాట్ విభాగాలకు నాయకత్వం వహించే సభ్యుడు (ఫైనాన్స్) ఆమోదం పొందిన తరువాత మాత్రమే ఈ ఉత్తర్వు జారీ చేశాయి.

డాట్(టెలికాం శాఖ)కు రూ.1.47 లక్షల కోట్ల బకాయిల చెల్లింపులకు సంబంధించి గడువును పొడిగించాలంటూ మంగళవారం నాడు టెలికాం సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్వీకరించింది. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, టాటా టెలిసర్వీస్‌లతో సహా టెలికం కంపెనీలు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను వచ్చే వారం విచారించనున్నట్టు కోర్టు తెలిపింది. రూ.1.47 లక్షల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడానికి గడువును పొడిగించాలని టెలికాం కంపెనీలు పిటిషన్‌లో కోరాయి. బకాయి చెల్లింపులను కంపెనీలు వ్యతిరేకించడం లేదని, అయితే చెల్లింపు తేదీలో మార్పు కోరుకుంటున్నామని కంపెనీల తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.

టెలికాం సంస్థలకు ఎజిఆర్ బకాయిల చెల్లింపు గడువు జనవరి 23. గతంలో సుప్రీం కోర్టు ఈ గడువు విధించింది. ఎజిఆర్ బకాయి చెల్లింపులపై ఉత్తర్వులను సమీక్షించాలని టెలికాం సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను జనవరి 16న కోర్టు కొట్టివేసింది. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, ఇతర టెలికాం కంపెనీలు రూ .1.47 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉందని టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ గత నవంబర్‌లో పార్లమెంటుకు చెప్పారు. ఎయిర్‌టెల్ లైసెన్స్ ఫీజు రూ.21,682 కోట్లు చెల్లించాల్సి ఉందని డాట్ సుప్రీం కోర్టుకు తెలిపింది. అదేవిధంగా వోడాఫోన్‌లో రూ .19,823 కోట్లు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 16,456 కోట్లు, అలాగే ప్రభుత్వ యాజమాన్యంలోని బిఎస్‌ఎన్‌ఎల్ రూ.2,098 కోట్లు, ఎంటిఎన్‌ఎల్ రూ.2,537 కోట్లు చెల్లించాల్సి ఉంది.

జియో రూ.195 కోట్లు చెల్లించింది
టెలికాం కంపెనీలకు రూ .1.47 లక్షల కోట్ల సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఎజిఆర్) చెల్లించడానికి గడువు గురువారం ముగిసింది. అంతకుముందు భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా రూ .88,624 కోట్ల ఎజిఆర్ బకాయిలు చెల్లించబోమని డాట్‌కు సమాచారం ఇచ్చాయి. వచ్చే వారం సుప్రీంకోర్టులో పిటిషన్‌పై విచారణ కోసం వేచి ఉండాలని రెండు సంస్థలు చెప్పాయి. అంతకుముందు సుప్రీంకోర్టు జనవరి 23 గడువు ఎజిఆర్ బకాయిలను నిర్ణయించింది. మరోవైపు రిలయన్స్ జియో గురువారం టెలికమ్యూనికేషన్ విభాగానికి రూ .195 కోట్లు ఎజిఆర్‌ను చెల్లించింది. డాట్ ప్రకారం, జియో జనవరి 23లోగా రూ.177 కోట్లు బకాయిలుగా చెల్లించాల్సి ఉంది. 2020 జనవరి 31 వరకు జియో అన్ని బకాయిలు చెల్లించనున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

కమ్యూనికేషన్ లేకపోవడంతో డాట్ డిమాండ్ చేసింది: ప్రధాన్
కమ్యూనికేషన్ లేకపోవడం కారణంగా టెలికాంయేతర సంస్థలైన గెయిల్, ఆయిల్ ఇండియా, పవర్‌గ్రిడ్ నుంచి డాట్ రూ .3 లక్షల కోట్లు డిమాండ్ చేసినట్లు కేంద్ర చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఈ సంస్థలపై ఆ చెల్లింపు బాధ్యత ఉండబోదని అన్నారు. గెయిల్ ఇండియా నుంచి రూ. 1.72 లక్షల కోట్లు, ఆయిల్ ఇండియా నుంచి రూ .48 వేల కోట్లు, పవర్‌గ్రిడ్ నుంచి రూ.40 వేల కోట్లు, రైల్, మరో ప్రభుత్వ సంస్థ నుంచి ఇలాంటి డిమాండ్లను డాట్ చేసింది. డాట్ ఈ డిమాండ్ ప్రభుత్వ సంస్థల మొత్తం నికర విలువ కంటే చాలా ఎక్కువ. ‘మేము టెలికాం మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతున్నాం’ అని ప్రధాన్ అన్నారు. కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల పిఎస్‌యుల నుండి ఇటువంటి డిమాండ్లు చేస్తోందని అన్నారు.

Reliance Jio pays Rs 195 crore AGR dues to DoT

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎలాంటి చర్యలు తీసుకోవద్దు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: