‘నారప్ప’ షూటింగ్ షురూ

  ఎఫ్2, వెంకీమామ వంటి వరుస బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్ 74వ చిత్రం ‘నారప్ప’ రెగ్యులర్ షూటింగ్ బుధవారం అనంతపురం జిల్లా ఉరవకొండలోని పాల్తూరు గ్రామంలో ప్రారంభమైంది. మొదటి సన్నివేశాన్ని వెంకటేష్‌పై చిత్రీకరించారు. తమిళ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘అసురన్’ చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి., వి క్రియేషన్స్ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ని తెలియజేస్తూ విడుదల […] The post ‘నారప్ప’ షూటింగ్ షురూ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఎఫ్2, వెంకీమామ వంటి వరుస బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్ 74వ చిత్రం ‘నారప్ప’ రెగ్యులర్ షూటింగ్ బుధవారం అనంతపురం జిల్లా ఉరవకొండలోని పాల్తూరు గ్రామంలో ప్రారంభమైంది. మొదటి సన్నివేశాన్ని వెంకటేష్‌పై చిత్రీకరించారు. తమిళ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘అసురన్’ చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి., వి క్రియేషన్స్ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ని తెలియజేస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది.

‘నారప్ప’ గెటప్‌లో విక్టరీ వెంకటేష్ లుక్ చాలా ఇంటెన్స్‌గా ఉంది. మాస్ గెటప్‌లో పూర్తి వైవిధ్యంగా కనిపిస్తూ ఆశ్చర్యపరిచారు వెంకటేష్. రాయలసీమలోని అనంతపురం పరిసర ప్రాంతాల్లోని రియలిస్టిక్ లొకేషన్లలో కీలక సన్నివేశాలను మొదటి షెడ్యూల్‌లో భాగంగా చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సామ్.కె నాయుడు, సంగీతం: మణిశర్మ, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్: గాంధీ నడికుడికర్, కథ: వెట్రిమారన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, విజయ్, లిరిక్స్: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, అనంతశ్రీరామ్, కృష్ణకాంత్, కాసర్ల శ్యాం.

Naarappa Shooting Start

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘నారప్ప’ షూటింగ్ షురూ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: