క్రిష్ దర్శకత్వంలో పవన్ 27వ మూవీ?

‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ తన సినిమాతో అభిమానులను అలరించేందుకు సిద్దమయ్యాడు. పవన్ 25వ చిత్రంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత పలు సినిమాలకు అడ్వాన్స్ తీసుకున్నా కూడా రాజకీయాలతో పవన్ బిజీ అయ్యారు. మళ్లీ ఈ స్టార్ హీరో సినిమాల్లో నటించడం అనుమానమే అంటూ ప్రచారం జరిగింది. అయితే సినిమాల్లో నటిస్తాడో లేదో అనుకున్న పవన్ వరుసగా చిత్రాలు చేసేందుకు […] The post క్రిష్ దర్శకత్వంలో పవన్ 27వ మూవీ? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ తన సినిమాతో అభిమానులను అలరించేందుకు సిద్దమయ్యాడు. పవన్ 25వ చిత్రంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత పలు సినిమాలకు అడ్వాన్స్ తీసుకున్నా కూడా రాజకీయాలతో పవన్ బిజీ అయ్యారు. మళ్లీ ఈ స్టార్ హీరో సినిమాల్లో నటించడం అనుమానమే అంటూ ప్రచారం జరిగింది. అయితే సినిమాల్లో నటిస్తాడో లేదో అనుకున్న పవన్ వరుసగా చిత్రాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం తన 26వ చిత్రంగా ‘పింక్’ రీమేక్‌ను చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. సోమవారం పవన్ షూటింగ్‌కు కూడా హాజరు అయ్యారని తెలిసింది. ఇక ఈ స్టార్ హీరో తదుపరి చిత్రం గురించిన ప్రకటన కూడా వచ్చేసింది. ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఏ.ఎం.రత్నం నిర్మాణంలో పవన్ తన 27వ చిత్రాన్ని చేయబోతున్నారట. ఈ చిత్రాన్ని ఈనెల 27న లాంఛనంగా ప్రారంభించబోతున్నట్లుగా తెలిసింది. క్రిష్ దర్శకత్వంలో పవన్ మూవీ అంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఏకంగా డేట్ కూడా వచ్చేసింది. దీంతో పవన్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

Pawan Kalyan 27th Movie with Director Krish?

The post క్రిష్ దర్శకత్వంలో పవన్ 27వ మూవీ? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: