ప్రభాస్ తల్లి పాత్రలో.. అల‌నాటి న‌టి

హైదరాబాద్: ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో ‘జాన్’ టైటిల్ తో ఓ రొమాంటిక్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అల‌నాటి పాపుల‌ర్ న‌టి భాగ్యశ్రీ కీలక పాత్ర పోషించడానికి సంతకం చేశారు. ‘మైనే ప్యార్ కియా’ సిన్మాతో భాగ్యశ్రీ సినీ ప్రియుల గుండెల్లో చెరగని ముద్ర వేసారు. ఆ చిత్రంలో ఆమె సల్మాన్ ఖాన్ తో కలిసి చేసిన సందడి ఇప్పటికి కళ్లముందు కదలాడుతుంది. చాలా గ్యాప్ తీసుకున్న భాగ్యశ్రీ ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో […] The post ప్రభాస్ తల్లి పాత్రలో.. అల‌నాటి న‌టి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో ‘జాన్’ టైటిల్ తో ఓ రొమాంటిక్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అల‌నాటి పాపుల‌ర్ న‌టి భాగ్యశ్రీ కీలక పాత్ర పోషించడానికి సంతకం చేశారు. ‘మైనే ప్యార్ కియా’ సిన్మాతో భాగ్యశ్రీ సినీ ప్రియుల గుండెల్లో చెరగని ముద్ర వేసారు. ఆ చిత్రంలో ఆమె సల్మాన్ ఖాన్ తో కలిసి చేసిన సందడి ఇప్పటికి కళ్లముందు కదలాడుతుంది. చాలా గ్యాప్ తీసుకున్న భాగ్యశ్రీ ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో మాత్రమే నటించింది. మళ్లీ ఇంతకాలానికి ప్రభాస్ సిన్మాతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వనున్నారు.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాదులో షూటింగు జరుపుకుంటోంది. ఈ చిత్రంలో ప్రభాస్ తల్లి పాత్రకి చాలా ప్రాధాన్యత వుంటుందట చిత్ర యూనిట్ వెల్లడించింది. అందుకే ఆ పాత్రకి భాగ్యశ్రీని ఒప్పించినట్టుగా డైరెక్టర్ రాధాకృష్ణ చెప్పారు. భాగ్యశ్రీ నటించే పాత్ర సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు.

Bhagyashree Lands Role in Prabhas20 Movie

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రభాస్ తల్లి పాత్రలో.. అల‌నాటి న‌టి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: