లంచం ఇవ్వనందుకు ఇలా కసి తీర్చుకున్నారు…

బరేలి(యుపి): జన్మ ధ్రువీకరణ పత్రం(బర్త్ సర్టిఫికెట్) జారీ చేసేందుకు లంచం ఇవ్వనందుకు గ్రామ పంచాయతీ అధికారులు ఇద్దరు చిన్నారుల వయసును వందేళ్లు పెంచేశారు. ఈ విచిత్ర సంఘటన బరేలీ జిల్లాలోని బేలా గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పవన్ కుమార్‌కు ఇద్దరు కుమారులు. శుభ్ వయసు నాలుగేళ్లు కాగా సంకేత్ వయసు రెండేళ్లు. వీరిద్దరి బర్త్ సర్టిఫికెట్ల కోసం పవన్ రెండు నెలల క్రితం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. కాగా, బర్త్ సర్టిఫికెట్ల జారీ చేయడానికి గ్రామ […] The post లంచం ఇవ్వనందుకు ఇలా కసి తీర్చుకున్నారు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

బరేలి(యుపి): జన్మ ధ్రువీకరణ పత్రం(బర్త్ సర్టిఫికెట్) జారీ చేసేందుకు లంచం ఇవ్వనందుకు గ్రామ పంచాయతీ అధికారులు ఇద్దరు చిన్నారుల వయసును వందేళ్లు పెంచేశారు. ఈ విచిత్ర సంఘటన బరేలీ జిల్లాలోని బేలా గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పవన్ కుమార్‌కు ఇద్దరు కుమారులు. శుభ్ వయసు నాలుగేళ్లు కాగా సంకేత్ వయసు రెండేళ్లు. వీరిద్దరి బర్త్ సర్టిఫికెట్ల కోసం పవన్ రెండు నెలల క్రితం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. కాగా, బర్త్ సర్టిఫికెట్ల జారీ చేయడానికి గ్రామ అభివృద్ధి అధికారి సుశీల్ చంద్ అగ్నిహోత్రి, గ్రామ సర్పంచ్ ప్రవీణ్ మిశ్రా రూ. 500 చొప్పున లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడానికి పవన్ నిరాకరించడంతో అతడి కుటుంబాన్ని వేధించాలని వీరిద్దరూ నిర్ణయించుకున్నారు. బర్త్ సర్టిఫికెట్లలో కావాలనే తేదీలు మార్చారు.

నాలుగేళ్ల శుభ్ పుట్టిన తేదీ 2016 జనవరి 6 అయితే సర్టిఫికెట్‌లో మాత్రం 1916 జనవరి 6 అని రాశారు. అలాగే రెండేళ్ల సంకేత్ 2018 జూన్ 13న జన్మించగా ఆ బాలుడి వయసును 1916 జూన్ 13 అని నమోదు చేశారు. ఆ సర్టిఫికెట్ల ప్రకారం చూస్తే శుభ్ వయసు 104 ఏళ్లు.. సంకేత్ వయసు 102 సంవత్సరాలు. ఈ సర్టిఫికెట్లు చూసి మండిపడిన పవన్ కోర్టును ఆశ్రయించారు. ఆ ఇద్దరు అధికారులపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించడంతో పోలీసులు వారిపై చర్యలు తీసుకుంటున్నారు.

UP officials add 100 yrs to minor children, minor children Sanket and Shubhs age was increased by 100 yrs by Bela village officials for not giving bribe for issuing birth certificates

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post లంచం ఇవ్వనందుకు ఇలా కసి తీర్చుకున్నారు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: