సెక్సురాకెట్ లో ప్రొడక్షన్ మేనేజర్, కేస్టింగ్ డైరెక్టర్ అరెస్టు

  ముంబై : ఇద్దరు విదేశీయులతోపాటు మొత్తం ముగ్గురు యువతులను బలవంతంగా వ్యభిచార ఊబి లోకి దింపారన్న నేరంపై బాలీవుడ్ ప్రొడక్షన్ మేనేజర్, కేస్టింగ్ డైరక్టర్ లను పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ సబర్బన్ ఏరియా అంధేరి లోని హొటల్‌లో ఈ అరెస్టు జరిగింది. ఈ నెలలో ఇది నాలుగో దాడి. బాలీవుడ్‌తో సంబంధం ఉన్న సెక్సురాకెట్ కేసులే ఎక్కువగా ఉన్నాయి. అంధేరి లోని ఇంపీరియల్ ప్యాలెస్ హోటల్‌లో ప్రొడక్షన్ మేనేజర్ నవెడ్ షరీఫ్ అహ్మద్ అఖ్తర్ […] The post సెక్సురాకెట్ లో ప్రొడక్షన్ మేనేజర్, కేస్టింగ్ డైరెక్టర్ అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముంబై : ఇద్దరు విదేశీయులతోపాటు మొత్తం ముగ్గురు యువతులను బలవంతంగా వ్యభిచార ఊబి లోకి దింపారన్న నేరంపై బాలీవుడ్ ప్రొడక్షన్ మేనేజర్, కేస్టింగ్ డైరక్టర్ లను పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ సబర్బన్ ఏరియా అంధేరి లోని హొటల్‌లో ఈ అరెస్టు జరిగింది. ఈ నెలలో ఇది నాలుగో దాడి. బాలీవుడ్‌తో సంబంధం ఉన్న సెక్సురాకెట్ కేసులే ఎక్కువగా ఉన్నాయి. అంధేరి లోని ఇంపీరియల్ ప్యాలెస్ హోటల్‌లో ప్రొడక్షన్ మేనేజర్ నవెడ్ షరీఫ్ అహ్మద్ అఖ్తర్ (26 కేస్టింగ్ డైరక్టర్ నవీద్ సాదిక్ సయద్ (22) సోమవారం రాత్రి అరెస్టు అయ్యారని పోలీస్ సోషల్ సర్వీస్ బ్రాంచి అధికారులు తెలిపారు. ఈ రాకెట్ నుంచి టర్క్‌మెనిస్థాన్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులను, ముగ్గురు యువతులను పోలీసులు రక్షించారు.

దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం టర్క్‌మెనిస్థాన్ దేశీయులు స్టూడెంట్ వీసాపై భారత్‌కు వచ్చారని, పునె కాలేజీలో చదువు తున్నారని, పోలీసులు తెలిపారు. బాలీవుడ్‌లో నటించాలంటే కొన్ని సర్దుబాట్లు తప్పవని వారిని అఖ్తర్, సయద్ నమ్మించారని చెప్పారు. ఈమేరకు అడ్వర్‌టైజ్‌మెంట్‌లో కొన్ని పాత్రలు నటించే అవకాశం కల్పిస్తామని నమ్మకంగా చెప్పి వారిని ముంబైకు తీసుకు వచ్చారు. వ్యభిచారం లోకి దింపడానికి ఒత్తిడి తెచ్చారు. ఈ రాకెట్‌లో మూడో వ్యక్తి మోడల్‌గా పనిచేస్తున్నారు. ఆ మోడల్ పరారీలో ఉన్నారు. ఒక్కో యువతి నుంచి రూ.40 వేలు వంతున వసూలు చేసినట్టు తెలిసింది.

Production manager casting director arrested on sex racket

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సెక్సురాకెట్ లో ప్రొడక్షన్ మేనేజర్, కేస్టింగ్ డైరెక్టర్ అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: