గల్లంతయిన వారంతా మృతులే

  కొలంబో : శ్రీలంకలో భయానక అంతర్యుద్ధం సందర్భంగా గల్లంతు అయిన వారంతా మృతులుగానే ప్రభుత్వం నిర్థారించింది. దేశాధ్యక్షులు గోటబాయ రాజపక్స్స తొలిసారిగా మంగళవారం ఈ విషయాన్ని ధృవీకరించారు. ఓ దశాబ్దం కిందట దేశంలోని ప్రభుత్వ సైన్యం, తమిళ టైగర్ల మధ్య జరిగిన దారుణ పోరు తరువాత వేలాది మంది జాడలేకుండా పోయింది. వీరిని గల్లంతయిన వారిజాబితాలో ఉంచుతూ వచ్చారు. అయితే వీరంతా మృతి చెందినట్లే అని రాజపక్స చెప్పారు. రాజపక్స ఈ యుద్ధ కీలక సమయంలో […] The post గల్లంతయిన వారంతా మృతులే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కొలంబో : శ్రీలంకలో భయానక అంతర్యుద్ధం సందర్భంగా గల్లంతు అయిన వారంతా మృతులుగానే ప్రభుత్వం నిర్థారించింది. దేశాధ్యక్షులు గోటబాయ రాజపక్స్స తొలిసారిగా మంగళవారం ఈ విషయాన్ని ధృవీకరించారు. ఓ దశాబ్దం కిందట దేశంలోని ప్రభుత్వ సైన్యం, తమిళ టైగర్ల మధ్య జరిగిన దారుణ పోరు తరువాత వేలాది మంది జాడలేకుండా పోయింది. వీరిని గల్లంతయిన వారిజాబితాలో ఉంచుతూ వచ్చారు. అయితే వీరంతా మృతి చెందినట్లే అని రాజపక్స చెప్పారు. రాజపక్స ఈ యుద్ధ కీలక సమయంలో దేశ రక్షణ కార్యదర్శిగా ఉన్నారు. 30 ఏండ్ల దేశ అంతర్యుద్ధం అణచివేతకు, తమిళ రెబెల్స్ సమస్య అంతానికి ఆయన కీలక పాత్ర పోషించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ జాడ తెలియకుండా పోయిన వారిని చనిపోయిన వారిగానే భావించాల్సి ఉంటుందని దేశాధ్యక్షులు తెలిపారు. గత వారం ఇక్కడ ఐరాసన నివాసిత సమన్వయకర్త హన్నా సింగెర్‌తో రాజపక్స మాట్లాడారు. మరికొన్ని అవసరమైన దర్యాప్తులు చేపట్టిన తరువాత, మరణ సర్టిఫికెట్ల జారీకి ఏర్పాట్లు చేస్తారని రాజపక్స వివరించారు.

All those missing are dead

The post గల్లంతయిన వారంతా మృతులే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: