బస్సు ప్రమాదంలో వృద్ధురాలుకు తీవ్రగాయాలు

  మనతెలంగాణ/వరంగల్ రూరల్: బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు వాహనం కదలడంతో బస్సు చక్రాల క్రిందపడి ఓ వృద్ధురాలికి తీవ్రగాయాలైన సంఘటన మంగళవారం పర్వతగిరి మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి సెంటర్ లో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ జబ్బురు నాగరాజు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం… శనివారం గ్రామ శివారు అరవయ్యపల్లి గ్రామానికి చెందిన గొట్టిముక్కుల వీరలక్ష్మి(60)తన కూతురు పర్వతగిరి మండలం చింత నెక్కొండ గ్రామానికి చెందిన మియాపురపు రత్నమాలను కలిసేందుకు నాలుగు రోజుల క్రితం వచ్చి […] The post బస్సు ప్రమాదంలో వృద్ధురాలుకు తీవ్రగాయాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మనతెలంగాణ/వరంగల్ రూరల్: బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు వాహనం కదలడంతో బస్సు చక్రాల క్రిందపడి ఓ వృద్ధురాలికి తీవ్రగాయాలైన సంఘటన మంగళవారం పర్వతగిరి మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి సెంటర్ లో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ జబ్బురు నాగరాజు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం… శనివారం గ్రామ శివారు అరవయ్యపల్లి గ్రామానికి చెందిన గొట్టిముక్కుల వీరలక్ష్మి(60)తన కూతురు పర్వతగిరి మండలం చింత నెక్కొండ గ్రామానికి చెందిన మియాపురపు రత్నమాలను కలిసేందుకు నాలుగు రోజుల క్రితం వచ్చి మంగళవారం తిరుగు ప్రయాణంలో భాగంగా అరవయ్యపల్లి గ్రామానికి చేరుకునేందుకు సుమారు 11.30 గంటల ప్రాంతంలో నెక్కొండలోని తెలంగాణ తల్లి సెంటర్‌ లో బస్సు కోసం వేచి చూస్తున్న సమయంలో నర్సంపేట డిపోకు చెందిన బస్సు అక్కడికి రాగానే.. వీరలక్ష్మి బస్సు ఎక్కుతున్న సమయంలో బస్సు డ్రైవర్ ఒక్కసారిగా వాహనాన్ని ముందుకు కదిలింది. దీంతో ప్రమాదవశాత్తు వీరలక్ష్మి బస్సుక్రింద పడటంతో రెండు చక్రాలు ఆమె కాళ్ల పైనుంచి వెళ్లడంతో కాళ్లు విరిగిపోయాయి. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఇట్టి విషయంపై వీరలక్ష్మి బంధువు మియాపురపు గురుబ్రహ్మ చారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్, కండక్టర్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

The post బస్సు ప్రమాదంలో వృద్ధురాలుకు తీవ్రగాయాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: