భారీ ఫీజులతో భ్రష్ట విద్యావ్యవస్థ

  ఇంగ్లాండులో 1998 వరకు ఉన్నత విద్యాభ్యాసం ఉచితంగా ఉండేది. కేవలం కాలేజీల ఫీజులు మాత్రమేకాదు, విద్యార్థులకు చదువు కొనసాగించడానికి గ్రాంటులు కూడా ఇచ్చేవారు. కాని 1998లో కొత్తగా అధికారంలోకి వచ్చిన టోనీ బ్లెయిర్ ప్రభుత్వం ట్యూషన్ ఫీజులు ప్రవేశపెట్టింది. నిజానికి అంతకు ముందు టోనీ బ్లెయిర్ ట్యూషన్ ఫీజుల వంటి నిర్ణయాలు ఏవీ తీసుకోము అని అంతకు ముందు హామీ ఇచ్చినప్పటికీ, ఇచ్చిన హామీని పక్కన పెట్టి ట్యూషన్ ఫీజులు ప్రవేశపెట్టారు. ఈ ఫీజులు 2003 […] The post భారీ ఫీజులతో భ్రష్ట విద్యావ్యవస్థ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఇంగ్లాండులో 1998 వరకు ఉన్నత విద్యాభ్యాసం ఉచితంగా ఉండేది. కేవలం కాలేజీల ఫీజులు మాత్రమేకాదు, విద్యార్థులకు చదువు కొనసాగించడానికి గ్రాంటులు కూడా ఇచ్చేవారు. కాని 1998లో కొత్తగా అధికారంలోకి వచ్చిన టోనీ బ్లెయిర్ ప్రభుత్వం ట్యూషన్ ఫీజులు ప్రవేశపెట్టింది. నిజానికి అంతకు ముందు టోనీ బ్లెయిర్ ట్యూషన్ ఫీజుల వంటి నిర్ణయాలు ఏవీ తీసుకోము అని అంతకు ముందు హామీ ఇచ్చినప్పటికీ, ఇచ్చిన హామీని పక్కన పెట్టి ట్యూషన్ ఫీజులు ప్రవేశపెట్టారు. ఈ ఫీజులు 2003 నాటికి 3000 పౌండ్లకు పెంచారు. ఇది కూడా 2001 ఎన్నికల మేనిఫెస్టోకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయమే. 2010లో గరిష్ఠంగా 9000 పౌండ్ల వరకు ఫీజులు పెంచారు. దాదాపు ఇంగ్లాండులోని యూనివర్శిటీలన్నీ ఈ ఫీజులు పెంచేశాయి. అన్ని కోర్సుల్లోను ఫీజులు పెరిగాయి.

విద్యార్థుల ఓట్లతోనే అత్యధిక మెజారిటీ సాధించిన లిబరల్ డెమొక్రాట్లు 2010లో ఈ ఫీజుల పెంపును సమర్ధించారు. ఆ తర్వాత పార్టీకి రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. లిబరల్ డెమొక్రాట్లు ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా బ్రిటన్ లో రాజకీయంగా ఎదగలేకపోయారు. బ్రిటీషు విద్యా వ్యవస్థలో ఉచిత ఉన్నత విద్య నుంచి భారీ ఫీజుల ఉన్నత విద్యా వ్యవస్థ వరకు ఈ ప్రయాణంలో భారతదేశానికి కూడా అనేక పాఠాలున్నయి. ఎందుకంటే భారతదేశం కూడా ఇదే బాటన పయనిస్తోంది. దేశంలో ప్రయివేటు విద్యాసంస్థల్లోనే కాదు, ప్రతిష్ఠాత్మకమైన ప్రభుత్వ విద్యాసంస్థలు ఐఐటిలు, ఐఐఎంలు, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ఫీజుల పెంపు క్రమేణా కొనసాగుతోంది. ఫీజులు పెంచి స్టూడెంట్ లోన్స్ ఇవ్వడమనే ఈ పద్ధతి ఎంతవరకు ఉపయోగపడుతుంది?

అందరు విద్యార్థులకు ఈ రుణ సదుపాయం లభించేలా చూడడానికి బ్రిటీషు ప్రభుత్వం స్టూడెంట్స్ లోన్ కంపెనీ ఏర్పాటు చేసింది. ఇది మన దేశంలో పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ వంటిది. అయితే, 2018లో బ్రిటనులోని జాతీయ గణాంకాల సంస్థ ప్రకారం ఇలాంటి రుణాలు చాలా వరకు తిరిగి చెల్లించడం జరగలేదు. అంటే, తర్వాత వచ్చే ప్రభుత్వాలపై ఈ రుణాల భారం పడుతోంది. ఎక్కౌంట్స్‌లో ఈ విద్యార్ధి రుణాలను కూడా ఇతర రుణాల మాదిరిగానే ప్రభుత్వ రుణాలుగా పరిగణిస్తారు. ఫలితంగా 12 బిలియన్ పౌండ్ల ద్రవ్యలోటు బ్రిటీషు ప్రభుత్వ ఖాతాల్లో చోటు చేసుకుంది. అంటే బ్రిటీషు జిడిపిలో 2018 లో 0.6 శాతం
ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకోవడానికి ఉన్నత విద్యాసంస్థల్లో ఫీజులు పెంచుతామని అంటున్నారు. విద్యార్థుల చదువుకు అవసరమైన ఏర్పాట్ల కోసం వారికి రుణాలిస్తారు. ఇది ఫీజులు విద్యార్థి రుణాల పద్ధతి. అయితే బ్రిటనులో జరిగిందేమిటో పరిశీలిస్తే ఈ పద్ధతి పని చేసేది కాదని తెలుస్తోంది. పైగా ఈ పద్ధతిలో ఇతర సమస్యలు కూడా ఉన్నాయి.

ట్యూషన్ ఫీజులను ప్రవేశపెట్టిన తర్వాత బ్రిటను విశ్వవిద్యాలయాల మౌలిక లక్షణాలే మారిపోయాయి. విద్యార్థులను వినియోగదారులుగా చూడడం ప్రారంభించిన తర్వాత విద్యార్థులు కూడా వినియోగదారులుగా వ్యవహరించడం ప్రారంభించారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ స్టిఫాన్ కొల్లీనీ అనేక సంవత్సరాల అధ్యయనంలో ఈ మార్పు గురించి వివరించారు. కళాశాలలు విద్యార్థులను ఆకర్షించడానికి, మెరుగైన విద్యార్థి వాతావరణం ఇస్తున్నామంటూ ప్రకటించడం, అందు కోసం విద్యార్జన, విద్యాభ్యాసాలతో సంబంధం లేని సదుపాయాలు, సౌకర్యాలకు భారీగా ఖర్చు పెట్టడం ప్రారంభించాయి.

విద్యార్థుల వ్యవహార శైలిలోను మార్పు వచ్చింది. అర్హత కన్నా ఎక్కువ స్థాయి గ్రేడు ఇవ్వాలనే డిమాండ్లు మొదలయ్యాయి. అంతకు ముందు తక్కువ గ్రేడు ఇచ్చిన పనికే ఇప్పుడు ఎక్కువ గ్రేడు ఇవ్వాలనే డిమాండ్ మొదలయ్యింది. అమెరికాలోని ఖరీదైన విశ్వవిద్యాలయాల్లో ఈ సమస్య ఎప్పటి నుంచో ఉంది. ఇదే సమస్య బ్రిటనులోను ప్రారంభమైంది. ఫీజులు చెల్లించిన విద్యార్థి వినియోగదారులు గ్రేడు కోసం డిమాండ్ చేయడం మొదలైంది. భారీ ఫీజుల చెల్లింపు రావడం వల్ల విద్యార్థులు కూడా లాభసాటి కోర్సుల వైపు మాత్రమే మొగ్గు చూపడం ప్రారంభమైంది. అంటే కోర్సు పూర్తి చేసిన తర్వాత ఆర్ధికంగా ప్రయోజనాలు ఏ కోర్సుల్లో ఉంటాయో ఆ కోర్సులనే ఎన్నుకోవడం ప్రారంభమైంది. అంటే మేనేజిమెంట్ వంటి కోర్సుల వైపు మాత్రమే దృష్టిపెట్టడం మొదలు పెట్టారు. సమాజానికి అవసరమైన నర్సింగ్ వంటి కోర్సుల పట్ల ఆసక్తి తగ్గింది.

కోల్లినీ వాదన ప్రకారం, బ్రిటనులో ఉన్నత విద్యాసంస్థల్లో ఈ పద్ధతి విఫలమైంది. నిజానికి ఈ పద్ధతి అమెరికా విశ్వవిద్యాలయాల్లోను విఫలమైంది. ఈ పద్ధతికి అనుకూలంగా వాదించిన ప్రొఫెసర్ గురుబచన్ సింగ్ వంటి వారు కూడా ఈ వాస్తవాలను ఒప్పుకోవలసి వచ్చింది. కేవలం కొందరికి మాత్రమే విద్యాభ్యాసానికి అవకాశం కల్పించే ఈ పద్ధతి ఆ దేశంలో సామాజికంగా నష్టదాయకమని రుజువైంది. ఈ పద్ధతి వల్ల సామాజిక చైతన్యం అనేది లేకుండా పోయింది. నిజానికి ప్రపంచంలో సామాజిక చైతన్యం విషయంలో అమెరికా, ఇంగ్లాండ్ విశ్వవిద్యాలయాలు చివరి ర్యాంకుల్లో ఉన్నాయి.

భారీ ఫీజులు, విద్యార్ధి రుణాల ఈ పద్ధతి పని చేసే పద్ధతి కాదన్నది స్పష్టం. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశానికి తగిన పద్ధతి ఏది అనేది ప్రశ్న. భారత విద్యా విధానాన్ని నిర్ణయించే వారు ఈ విషయమై ఆలోచించాలి. చాలా దేశాల్లో, జర్మనీ వంటి యూరోపియన్ దేశాల్లో ఉన్నత విద్యా భ్యాసం పూర్తిగా ఉచితం లేదా దాదాపు ఉచితం. జర్మనీ ఈ సదుపాయం విదేశీ విద్యార్థులకు కూడా కల్పిస్తుంది. పైన చెప్పుకున్న భారీ ఫీజుల మోడల్ నిజానికి ఇంగ్లాండుకు సంబంధించింది మాత్రమే. బ్రిటనుకు సంబంధించింది కాదు. ఎందుకంటే స్కాట్లాండ్ లో స్థానిక విద్యార్థులకు, యూరోపియన్ యూనియన్ విద్యార్థులకు విద్యాభ్యాసం ఉచితం. అయితే తర్వాత ఇంగ్లాండు విద్యార్థులకు ఫీజులు వడ్డించడం ప్రారంభించింది. ఉన్నత విద్యాభ్యాసం వల్ల మెరుగైన విద్యావంతులు సమాజానికి లభిస్తారు. కాలేజీ డిగ్రీ సాధించుకున్న వారికి మరిన్ని ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అయితే ఉన్నత విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చు ఎవరు భరించాలన్న విషయమై తగిన చర్చ జరగాలి. ఏది ఏమైనా భారీ ఫీజులు, విద్యార్థి రుణాల పద్ధతి విఫలమైందన్నది స్పష్టం.

Tony Blair government has introduced tuition fees in 1998

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post భారీ ఫీజులతో భ్రష్ట విద్యావ్యవస్థ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: