బడ్జెట్ హల్వా

  హల్వా వేడుకతో బడ్జెట్ పత్రాల ముద్రణ షురూ ప్రారంభించిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం న్యూఢిల్లీలో సాధారణ బడ్జెట్ 2020 ముద్రణ ప్రక్రియ ప్రారంభానికి గుర్తుగా నిర్వహించిన ‘హల్వా’ వేడుకలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, ఇతర ఉన్నతాధికారులు   న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్ 202021కు సంబంధించిన పత్రాల ముద్రణకు ముందు ‘హల్వా వేడుక’ జరుపడం ఆనవాయితీగా వస్తోంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు సంబంధించిన పత్రాల […] The post బడ్జెట్ హల్వా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హల్వా వేడుకతో బడ్జెట్ పత్రాల ముద్రణ షురూ
ప్రారంభించిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

సోమవారం న్యూఢిల్లీలో సాధారణ బడ్జెట్ 2020 ముద్రణ ప్రక్రియ ప్రారంభానికి గుర్తుగా నిర్వహించిన ‘హల్వా’ వేడుకలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, ఇతర ఉన్నతాధికారులు

 

న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్ 202021కు సంబంధించిన పత్రాల ముద్రణకు ముందు ‘హల్వా వేడుక’ జరుపడం ఆనవాయితీగా వస్తోంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు సంబంధించిన పత్రాల ముద్రణను ప్రారంభిస్తున్న సందర్భంగా సోమవారం హల్వా వేడు క నిర్వహించారు. న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించా రు. ఈ వేడుకకు సీతారామన్‌తో పాటు ఆర్థిక సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికులు కూడా హాజరయ్యారు. లోక్‌సభలో ఆర్థికమంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేంత వరకు ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన పలువురు అధికారులు తమతమ కుటుంబాల కు దూరంగా ఉంటారు. ఇందుకు సంకేతంగా హల్వా వేడుకను ప్రారంభిస్తారు. సుదీర్ఘ కాలంగా ఆనవాయితీగా వస్తున్న ఈ హల్వాను పెద్ద కడాయ్‌లో సిద్ధం చేస్తారు. దీనిని మంత్రిత్వశాఖలోకి అధికారులు అందరికీ సీతారామన్ పంచారు.

ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శులు, సిబిడిటి, సిబిఐసి చీఫ్, బడ్జెట్‌తో సంబం ధం ఉన్న ఇతర ముఖ్య అధికారులు, ఇతర ఉద్యోగులు కూడా హల్వా వేడుకలో భాగమయ్యారు. ఫిబ్రవరి 1న సమర్పించనున్న కేంద్ర బడ్జెట్‌లో మౌలిక సదుపాయా లు, పునరుత్పాదక ఇంధనం, రైల్వే, వ్యవసాయం, నీటిపారుదల, ఆరోగ్యం, నీరు వంటి వాటిలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. గత త్రైమాసికంలో జిడిపి వృద్ధి 4.5 శాతంగా ఉంది. ఇటువంటి పరిస్థితిలో డిమాండ్ పెంచడం, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడాన్ని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. సాధారణ బడ్జెట్ 2020 ఫిబ్రవరి 1న ప్రవేశపెడితే, ఆర్థిక సర్వే జనవరి 31న వస్తుంది.ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పలు రాయితీలను ప్రకటించవచ్చని తెలుస్తోంది.

 

హల్వా వేడుక అంటే?
ప్రతి సంవత్సరం బడ్జెట్ ఖరారు కావడానికి కొన్ని రోజుల ముందు ఆర్థిక మంత్రిత్వ శాఖలోని నార్త్ బ్లాక్‌లో హల్వా తయారు చేస్తారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి స్వయంగా పాల్గొంటారు. హల్వా తయారుచేసే వేడుక చాలాకాలం నుండి కొనసాగుతోంది. దీని వెనుక కారణం ఏమిటంటే హల్వాను చాలా పవిత్రంగా భావిస్తారు, శుభకార్యాలను కూడా తీపితో ప్రారంభిస్తారు. ఈ వేడుకలో హల్వాను పెద్ద కడాయ్ లో తయారుచేస్తారు. ఈ హల్వాను ఆర్థిక మంత్రి సహా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉద్యోగులకు పంచుతారు.

ఉద్యోగులు 10 రోజులు బయటి ప్రపంచానికి దూరం
ఈ హల్వా వేడుక తరువాత నార్త్ బ్లాక్‌లో బడ్జెట్ పత్రా లు ముద్రిస్తారు. ఈ ప్రక్రియ రాబోయే 10 రోజులు నడుస్తుంది. దానిలో పాల్గొన్న మంత్రిత్వ శాఖ ఉద్యోగులు అక్కడే ఉంటూ కుటుంబం, బయటి వాతావరణానికి దూరంగా ఉండాలి. పార్లమెంటులో బడ్జెట్ సమర్పించబడే వరకు ఈ అధికారులు మంత్రిత్వ శాఖలోనే ఉంటారు. వారికి కుటుంబ సభ్యులతో, బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండవు. ఫోన్ లేదా ఇమెయిల్ ద్వారా ఎవరినీ సంప్రదించడానికి వారికి అనుమతి లేదు. మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులకు మాత్ర మే ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఉంది. బడ్జెట్ ముద్ర ణ పూర్తిగా రహస్యంగా నిర్వహిస్తారు. బడ్జెట్ ముద్రణ ప్రక్రియతో సంబంధం ఉన్న అధికారులు, ఉద్యోగులు మొత్తం ప్రపంచం నుండి 10 రోజులు దూరంగా ఉంటారు. ఈ 100 మంది అధికారులు, ఉద్యోగులను ఇంటికి వెళ్ళడానికి అనుమతించరు.

ఆర్థిక మంత్రి చాలా సీనియర్ అధికారులకు మాత్రమే ఇంటికి వెళ్ళటానికి అనుమతి ఉంటుంది. ఈ కాలంలో ఆర్థిక మంత్రిత్వశాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుంది. బయటి వ్యక్తి ఎవరూ ఆర్థిక మంత్రిత్వ శాఖలోకి ప్రవేశించరు. ఈ సమయంలో ప్రింటింగ్ అధికారులు, ఉద్యోగులు బయటకు రావడం లేదా వారి సహచరులను కలవడం కూడా నిషేధిస్తారు. ఒకవేళ సందర్శకులకు చాలా ముఖ్యమైన విషయం ఉంటే వారిని భద్రతా సిబ్బంది పర్యవేక్షణలో లోపలికి పంపుతారు. ఇంటెలిజెన్స్ విభాగం నుండి సైబర్ సెక్యూరిటీ సెల్ వరకు ప్రతి ఒక్కరూ ఆర్థిక మంత్రిత్వ శాఖకు రక్షణగా ఉంటారు. ఈ 10 రోజుల వరకు మంత్రిత్వ శాఖలోని మొబైల్ నెట్‌వర్క్ పనిచేయదు.

ల్యాండ్‌లైన్ ఫోన్‌ల ద్వారా మాత్రమే సంభాషణలు చేయాల్సి ఉంటుంది. వైద్యుల బృందాన్ని కూడా 10 రోజుల పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖలో నియమిస్తారు. ఒక ఉద్యోగి అనారోగ్యానికి గురైతే అతనికి వైద్య సదుపాయాలు కల్పిస్తారు. ఇంటర్నెట్, ఎన్‌ఐసి సర్వర్లు బడ్జెట్ పత్రం ఉన్న కంప్యూటర్ల నుండి తొలగిస్తారు. ఎలాంటి హ్యాకింగ్ లేకుండా ఏర్పాట్లు చేస్తారు. ఈ కంప్యూటర్లు ప్రింటర్, ప్రింటింగ్ మెషిన్‌కు మాత్రమే అనుసంధానిస్తారు. ప్రింటింగ్ ప్రెస్ ఉన్న ఆర్థిక మంత్రిత్వశాఖలో ఎంపిక చేసిన సీనియర్ అధికారులను మాత్రమే సందర్శించడానికి అనుమతిస్తారు.

FM Nirmala Sitharaman attends traditional halwa ceremony

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బడ్జెట్ హల్వా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: