ఆత్మహత్య చేసుకుందామనుకున్నా

న్యూఢిల్లీ: డిప్రెషన్ కారణంగా కొన్ని నెలల క్రితం ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు టీమిండియా మాజీ బౌలర్ ప్రవీణ్ కుమార్ దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు చేశాడు. హరిద్వార్ హైవేపై తన లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో షూట్ చేసుకుందామని అనుకున్నానని, అయితే చిరునవ్వుతో ఉన్న తన చిన్నారుల ఫోటో చూసిన తర్వాత ధైర్యం చాలలేదని అన్నాడు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ప్రవీణ్ ఈ సంచలన విషయాలు వెల్లడించాడు. టీమిండియాలో చోటు కోల్పోవడంతో పాటు ఐపిఎల్ కాంట్రాక్ట్ ముగియడం వంటి కారణాలతో […] The post ఆత్మహత్య చేసుకుందామనుకున్నా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: డిప్రెషన్ కారణంగా కొన్ని నెలల క్రితం ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు టీమిండియా మాజీ బౌలర్ ప్రవీణ్ కుమార్ దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు చేశాడు. హరిద్వార్ హైవేపై తన లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో షూట్ చేసుకుందామని అనుకున్నానని, అయితే చిరునవ్వుతో ఉన్న తన చిన్నారుల ఫోటో చూసిన తర్వాత ధైర్యం చాలలేదని అన్నాడు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ప్రవీణ్ ఈ సంచలన విషయాలు వెల్లడించాడు. టీమిండియాలో చోటు కోల్పోవడంతో పాటు ఐపిఎల్ కాంట్రాక్ట్ ముగియడం వంటి కారణాలతో తాను పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే ఇవన్నీ ఏమిటి? ఇక జీవితాన్ని ముగిద్దాం అనుకున్నానని చెప్పాడు. ‘ కెరీర్ ఆరంభంలో అందరూ నన్ను మెచ్చుకున్నారు. అదే విధంగా ఇంగ్లాండ్ సిరీస్ అనంతరం టెస్టు క్రికెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ అనూహ్యంగా జట్టులోంచి నన్ను తప్పించారు. మళ్లీ అవకాశాలు ఇవ్వలేదు. ఐపిఎల్ కాంట్రాక్ట్ కూడా ముగిసిపోవడంతో పూర్తి నిరాశకు గురయ్యాను. డిప్రెషన్‌తో నరకం చూశాను. అయితే డిప్రెషన్‌ను భారత్‌లో ఎవరూ అర్థం చేసుకోరని ఎవరికీ చెప్పలేదు. దీంతో ఇవన్నీ ఏమిటి? ఇక జీవితాన్ని ముగిద్దాం అనుకుని మీరట్‌నుంచి హరిద్వార్‌కు నా లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో బయలుదేరాను. జాతీయ రహదారిపై కారును పక్కన ఆపి రివాల్వర్‌తో షూట్ చేసుకుందామనుకున్నా. కానీ నవ్వుతున్న నా పిల్లల ఫొటో చూశాక మనసు రాలేదు. ఎందుకంటే నేను చనిపోతే వారు అనాథలవుతారు. నా కారణంగా అమాయకులైన వారు రోడ్డున పడతారు. ఇవన్నీ ఆలోచించి నా మనసు మార్చుకున్నా. ఇప్పుడు అంతా కూల్. బాగానే ఉన్నాను. ప్రస్తుతం క్రికెట్ కోచింగ్ వైపు అడుగులు వేస్తున్నా’ అని ప్రవీణ్ కుమార్ వివరించాడు.
కాగా ప్రవీణ్ కుమార్ 2007 నవంబర్‌లో పాకిస్థాన్‌తో జరిగిన వన్‌డోలో అరంగేట్రం చేశాడు. 2012 మార్చి30న దక్షిణాఫ్రికాతో తన చివరి మ్యాచ్ ఆడాడు. భారత్ తరఫున మొత్తంమీద ఆరు టెస్టులు, 68 వన్డేలు, 10 టి20 మ్యాచ్‌లు ఆడాడు.అన్ని ఫార్మాట్లలో కలిపి 112 వికెట్లు తీశాడు. 2018లో రిటైర్మెంట్ ప్రకటించాడు. నిజానికి ప్రవీణ్ కుమార్ 2012లోనే టీమిండియాలో చోటు కోల్పోయాడు.ఇక టీమిండియాలో అవకాశం లభించే చాన్స్ లేకపోవడంతోనే రిటైర్మెంట్ ప్రకటించాడని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

 Wanted to End My Life Says Praveen Kumar

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆత్మహత్య చేసుకుందామనుకున్నా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: