నా నిజ స్వభావానికి దగ్గరైన పాత్ర చేశా

  మాస్ మహారాజా రవితేజ, నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్ హీరోహీరోయిన్లుగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిస్కో రాజా’. ఓ వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించారు. ఈనెల 24న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ నభా నటేష్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు… రవితేజ మార్క్ మాస్ మూవీ… మాస్, సైన్స్ ఫిక్షన్ మూవీ ‘డిస్కో రాజా’. విఐ ఆనంద్ […] The post నా నిజ స్వభావానికి దగ్గరైన పాత్ర చేశా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మాస్ మహారాజా రవితేజ, నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్ హీరోహీరోయిన్లుగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిస్కో రాజా’. ఓ వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించారు. ఈనెల 24న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ నభా నటేష్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
రవితేజ మార్క్ మాస్ మూవీ…
మాస్, సైన్స్ ఫిక్షన్ మూవీ ‘డిస్కో రాజా’. విఐ ఆనంద్ శైలిలో సాగే రవితేజ మార్క్ మాస్ మూవీ ఇది. కథాకథనాలు చాలా భిన్నంగా ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమిది.
వాస్తవానికి దగ్గరగా…
నా గత చిత్రాలకు భిన్నంగా నా పాత్ర వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుంది. తన చుట్టూ ఉన్న వారి గురించి ఆలోచించే ఒక అమ్మాయి పాత్ర నాది. నేను ఓ బ్యాంక్ ఉద్యోగిగా కనిపిస్తాను. ఈ పాత్ర నా నిజ స్వభావానికి చాలా దగ్గరగా ఉంటుంది.
ఆయన ఎనర్జీ లెవెల్స్ అద్భుతం…
రవితేజతో కలిసి పనిచేయడానికి ఎవరైనా ఇష్టపడతారు. ఆయన నటించిన ‘కిక్’ నా ఫేవరేట్ మూవీ. ఆయన ఎనర్జీ లెవెల్స్ అద్భుతం. సెట్‌లో ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతూనే ఉంటారు. సినిమాలు, ఫుడ్, ఆయన ఫామ్‌హౌస్‌లో పండించే పండ్ల గురించి చెబుతూ ఉండేవారు.
ఆమెతో సన్నివేశాలు ఉండవు…
ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, నా కాంబినేషన్‌లో సన్నివేశాలు ఉండవు. నాకు రవితేజ, సత్యం రాజేష్, నరేష్‌తో ఎక్కువగా సన్నివేశాలు ఉంటాయి.
తదుపరి చిత్రాలు…
‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాలో నా రోల్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇది కూడా ఓ భిన్నమైన పాత్ర. అదేవిధంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్‌గా చేస్తున్నాను. అలాగే తమిళంలో ఓ స్టోరీ చర్చల్లో ఉంది.

Nabha Natesh Special Interview

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నా నిజ స్వభావానికి దగ్గరైన పాత్ర చేశా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: