కొత్త చిత్రాన్ని ప్రకటించిన అల్లరి నరేష్.. పోస్టర్ అదిరింది

  నటకిరీటి రాజేంద్రప్రసాద్ తర్వాత అల్లరి నరేష్ తన సినిమాలతో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించాడు. ఒకరకంగా చెప్పాలంటే కామెడీ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాడు. అలా వరుస హిట్ సినిమాలతో మినిమమ్‌ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నరేష్ కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోయింది. నరేష్ సినిమాలు చూసి పడిపడి నవ్వుకునే ప్రేక్షకులు ఒక్కసారిగా అతన్ని పక్కనపెట్టేశారు. దీంతో నరేష్ ఎన్ని సినిమాలు చేసిన ప్లాపులుగానే తేల్చేశారు. దీంతో గతకొంతకాలంగా నరేష్ ఒక్క సినిమా […] The post కొత్త చిత్రాన్ని ప్రకటించిన అల్లరి నరేష్.. పోస్టర్ అదిరింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నటకిరీటి రాజేంద్రప్రసాద్ తర్వాత అల్లరి నరేష్ తన సినిమాలతో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించాడు. ఒకరకంగా చెప్పాలంటే కామెడీ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాడు. అలా వరుస హిట్ సినిమాలతో మినిమమ్‌ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నరేష్ కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోయింది. నరేష్ సినిమాలు చూసి పడిపడి నవ్వుకునే ప్రేక్షకులు ఒక్కసారిగా అతన్ని పక్కనపెట్టేశారు. దీంతో నరేష్ ఎన్ని సినిమాలు చేసిన ప్లాపులుగానే తేల్చేశారు. దీంతో గతకొంతకాలంగా నరేష్ ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమాతో తిరిగి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో నరేష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. దీని తర్వాత ప్రస్తుతం నరేష్ సోలో హీరోగా బంగారు బుల్లోడు అనే మూవీ చేస్తున్నాడు. తాజాగా నరేష్ మరో కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్‌ను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ఈ పోస్టర్ సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎస్వి 2 ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సతీష్‌ వేగేశ్న నిర్మిస్తున్న ఈ సినిమాని విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు చిత్రయూనిట్ సోమవారం వెల్లడించనున్నారు.

 

Allari Naresh New Movie Poster Released

The post కొత్త చిత్రాన్ని ప్రకటించిన అల్లరి నరేష్.. పోస్టర్ అదిరింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: