ఐఎఎస్ నంటూ యువతులకు ఎరవేసిన మాయగాడి అరెస్టు

ముంబయి: ఐఎఎస్ లేదా ఐపిఎస్ అధికారినని చెప్పుకుంటూ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో అమ్మాయిలకు ఎరవేసి వారి నుంచి లక్షలాది రూపాయలు కాజేసిన ఒక మాయగాడిని ముంబయి పోలీసులు అరెస్టుచేశారు. 32 ఏళ్ల ఆదిత్య మాత్రే నిజానికి ఒక సివిల్ ఇంజనీర్ కాగా వివాహ సంబంధాలకు సంబంధించిన వెబ్‌సైట్లలో మాత్రం తనను తాను ఐఎఎస్ లేదా ఐపిఎస్ ఆఫీసర్‌నని పరిచయం చేసుకునే వాడు. ఈ విధంగా అతను దాదాపు 25 మంది యువతులను మోసం చేసినట్లు దిందోషి పోలీసు స్టేషన్ […] The post ఐఎఎస్ నంటూ యువతులకు ఎరవేసిన మాయగాడి అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి: ఐఎఎస్ లేదా ఐపిఎస్ అధికారినని చెప్పుకుంటూ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో అమ్మాయిలకు ఎరవేసి వారి నుంచి లక్షలాది రూపాయలు కాజేసిన ఒక మాయగాడిని ముంబయి పోలీసులు అరెస్టుచేశారు. 32 ఏళ్ల ఆదిత్య మాత్రే నిజానికి ఒక సివిల్ ఇంజనీర్ కాగా వివాహ సంబంధాలకు సంబంధించిన వెబ్‌సైట్లలో మాత్రం తనను తాను ఐఎఎస్ లేదా ఐపిఎస్ ఆఫీసర్‌నని పరిచయం చేసుకునే వాడు. ఈ విధంగా అతను దాదాపు 25 మంది యువతులను మోసం చేసినట్లు దిందోషి పోలీసు స్టేషన్ సిఐ ధరేంద్ర కాంబ్లే వెల్లడించారు. ఒక ప్రముఖ మ్యారేజ్ వెబ్‌సైట్‌లో ఐఎఎస్ అధికారిగా తన ప్రొఫైల్‌లో పొందుపరిచిన ఆదిత్య అనే వ్యక్తి దాదాపు 25 మంది అవివాహిత యువతులను మోసం చేశాడని ఆయన చెప్పారు.

తాను బాగా డబ్బున్న వ్యక్తినని చూపించడానికి ఆదిత్య మాత్రే తన సోషల్ మీడియా అకౌంట్లలో ఇంపోర్టెడ్ కార్లతో తీసుకున్న ఫోటోలను పోస్ట్ చేశాడని, ఇలా తనను తాను బాగా సంపన్నుడని నాటకమాడి అమ్మాయిలను మోసం చేశాడని సిఐ చెప్పారు. ఐఎఎస్ లేదా ఐపిఎస్ అధికారిగా చెప్పుకుంటూ తాను ప్రభుత్వంలో ఒక పెద్ద హోదాలో ఉన్నానని అమ్మాయిలను నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ. 5 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు రాబట్టాడని ఆయన వివరించారు. కొద్ది రోజుల క్రితం అతని మోసాలపై పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు కాగా పోలీసులు వలపన్ని ఆదిత్య మాత్రేను అరెస్టు చేశారు.

Cheater arrested for posing as IAS officer, Aditya Mhatre was arrested by Mumbai police for posing as IAS on Matrimonial site and duping around 25 girls

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఐఎఎస్ నంటూ యువతులకు ఎరవేసిన మాయగాడి అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: