144 రైలు సర్వీసులల్లో ‘కోచ్ మిత్ర’

ఆన్‌లైన్ డిజిటల్ అప్లికేషన్ సేవలు త్వరలో 2 సర్వీసుల్లో శ్రీకారం జిఎం గజానన్ మాల్య వెల్లడి హైదరాబాద్: రైల్వే ప్రయాణికుల సేవల విస్తరణలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని 144 రైళ్లలో కోచ్ మిత్ర ఆన్‌లైన్ డిజిటల్ ఆప్లికేషన్ సేవలను అమలు చేస్తున్నారు. తర్వలో మరో రెండు రైళ్లలో సేవలను విస్తరిస్తారని జిఎం.గజానన్ మాల్య వెల్లడించారు. శుక్రవారం విడదుల చేసిన ప్రకటనలో కోచ్‌ల శుభ్రత, నీటి వసతి, లైటింగ్ తదితర సేవల విస్తరణలో లోపాలను […] The post 144 రైలు సర్వీసులల్లో ‘కోచ్ మిత్ర’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఆన్‌లైన్ డిజిటల్ అప్లికేషన్ సేవలు
త్వరలో 2 సర్వీసుల్లో శ్రీకారం
జిఎం గజానన్ మాల్య వెల్లడి

హైదరాబాద్: రైల్వే ప్రయాణికుల సేవల విస్తరణలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని 144 రైళ్లలో కోచ్ మిత్ర ఆన్‌లైన్ డిజిటల్ ఆప్లికేషన్ సేవలను అమలు చేస్తున్నారు. తర్వలో మరో రెండు రైళ్లలో సేవలను విస్తరిస్తారని జిఎం.గజానన్ మాల్య వెల్లడించారు. శుక్రవారం విడదుల చేసిన ప్రకటనలో కోచ్‌ల శుభ్రత, నీటి వసతి, లైటింగ్ తదితర సేవల విస్తరణలో లోపాలను తెలియజేయడానికి భారతీయ రైల్వే కోచ్ మిత్ర పేరుతో ఆన్‌లైన్ డిజిటల్ ఆప్లికేషన్ సేవలను ప్రవేశపెట్టారు. భారతీయ రైల్వే స్వచ్ఛ్ రైల్‌స్వచ్ఛ్ భారత ఉద్యమంలో భాగంగా కోచ్ మిత్ర ఆన్‌లైన్ ఆప్లికేషన్ సేవలను 2016లో ప్రారంభించగా, ఈ సేవలను మరింతగా విస్తృతం చేస్తూ 2018 డిసెంబర్‌లో పరిశుభ్రత, క్రిమిసంహారకాలు, బెడ్ రోళ్ళు లైటింగ్, ఏసి, నీటి వసతి సంబంధించిన సమస్యలను ఆప్లికేషన్‌లో నమోదును అందుబాటులో తెచ్చారు.

దేశ వ్యాప్తంగా ఓబిహెచ్‌ఎస్ వ్యవస్థ కలిగిన 800 రైళ్ళలో ప్రవేశపెట్టారు. నేడు ఈ సౌకర్యం 2.167 రైళ్లకు విస్తరించారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో విజయవంతంగా అమలు చేస్తున్నారు. ప్రతి నెల ఫోన్, యాప్, వైబ్‌సైట్ ద్వారా 470 అభ్యర్థనలు కోచ్‌మిత్రలో నమోదవుతున్నాయని తెలిపారు. ఇందులో 90శాతం ఫిర్యాదులు పరిష్కరించడం జరిగింది. 87శాతం అభ్యర్థనలను కేవలం 30 నిమిషాల వ్యవధిలో తీర్చడం జరిగింది. కేవలం 2శాతం మాత్రమే అసంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడించారు. కోచ్ మిత్ర యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న వారి సంఖ్య 10వేలకు పైగా ఉందని వివరించారు. ఈ మేరకు జోన్ డిజిటల్ సాంకేతికతను ఉపయోగిస్తుంది. జిపిఎస్ ఆధారిత బయోమెట్రిక్ పద్దతిలో హాజరు తీసుకుని, సిబ్బంది శుభ్రం చేస్తున్న ఫోటోలను కూడా ప్రసారం చేస్తున్నారని పేర్కొన్నారు. సికింద్రాబాద్, గుంతకల్లు స్టేషన్‌ల్లో ట్యాబ్‌లెట్ పిసి ఆధారంగా ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకొనే పద్దతి ప్రవేశపెట్టబడిందని తెలిపారు.

Passengers Positive Feedback for Coach Mitra

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 144 రైలు సర్వీసులల్లో ‘కోచ్ మిత్ర’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: