లండన్‌లో నిమ్స్ డాక్టర్‌కు గుండెపోటు

  పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స హైదరాబాద్ : సీనియర్ న్యూరాలజిస్ట్, ప్రొఫెసర్, న్యూరాలజీ విభాగం, నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) డాక్టర్ ఎకె మీనా పరిస్థితి విషమంగా ఉంది. వెంటిలేటర్ మద్దతుతో చికిత్స నందిస్తున్నారు. ప్రముఖ వైద్యురాలు, న్యూరాలజీ ఫ్యాకల్టీ మంగళవారం లండన్‌లో జరిగిన అంతర్జాతీయ వైద్య సమావేశానికి హాజరయ్యారు. ఆ సమయంలో డాక్టర్ మీనాకు గుండెనొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలారు. సమావేశంలో తొటి భారతీయ న్యూరాలజిస్టులు హాజరయ్యారు. ఆమె కుప్పకూలడంతో వెంటనే చికిత్స […] The post లండన్‌లో నిమ్స్ డాక్టర్‌కు గుండెపోటు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స

హైదరాబాద్ : సీనియర్ న్యూరాలజిస్ట్, ప్రొఫెసర్, న్యూరాలజీ విభాగం, నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) డాక్టర్ ఎకె మీనా పరిస్థితి విషమంగా ఉంది. వెంటిలేటర్ మద్దతుతో చికిత్స నందిస్తున్నారు. ప్రముఖ వైద్యురాలు, న్యూరాలజీ ఫ్యాకల్టీ మంగళవారం లండన్‌లో జరిగిన అంతర్జాతీయ వైద్య సమావేశానికి హాజరయ్యారు. ఆ సమయంలో డాక్టర్ మీనాకు గుండెనొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలారు. సమావేశంలో తొటి భారతీయ న్యూరాలజిస్టులు హాజరయ్యారు. ఆమె కుప్పకూలడంతో వెంటనే చికిత్స నిమిత్తం లండన్ ఆసుపత్రికి తరించారు. అక్కడి వైద్యులు అత్యవసర యాంజియోప్లాస్టీ నిర్వహించి, అడ్డుపడే ధమనులను అన్‌బ్లాక్ చేయడానికి మూడు స్టెంట్లను అమర్చారు. డాక్టర్ మీనా బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడతున్నప్పుడు గుండెపోటు నుంచి కోలుకునేందుకు వీలు గా ఆమెకు వెంటిలేటర్ సపోర్ట్‌తో చికిత్స నందిస్తున్నారు.

Nims doctor suffers heart attack in London

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post లండన్‌లో నిమ్స్ డాక్టర్‌కు గుండెపోటు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: