పిహెచ్‌ఎల్ చైర్మన్‌గా జగన్ మోహన్ రావు

  హైదరాబాద్: ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (పిహెచ్‌ఎల్) గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా జగన్ మోహన్ రావును ఎంపిక చేశారు. జగన్ మోహన్ రావు భారత హ్యాండ్‌బాల్ సమాఖ్యకు అసోసియేట్ ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్నారు. తాజాగా ఆయనను పిహెచ్‌ఎల్ చైర్మన్‌గా నియమించారు. దేశంలో హ్యాండ్‌బాల్ అభివృద్ధికి జగన్ మోహన్ రావు ఎంతో కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన సేవలకు గుర్తింపుగా పిహెచ్‌ఎల్ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు దీపక్ రాఠిను కోఆర్డినేటర్‌గా నియమించారు. అంతర్జాతీయ హ్యాండ్‌బాల్ సమాఖ్య, […] The post పిహెచ్‌ఎల్ చైర్మన్‌గా జగన్ మోహన్ రావు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (పిహెచ్‌ఎల్) గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా జగన్ మోహన్ రావును ఎంపిక చేశారు. జగన్ మోహన్ రావు భారత హ్యాండ్‌బాల్ సమాఖ్యకు అసోసియేట్ ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్నారు. తాజాగా ఆయనను పిహెచ్‌ఎల్ చైర్మన్‌గా నియమించారు. దేశంలో హ్యాండ్‌బాల్ అభివృద్ధికి జగన్ మోహన్ రావు ఎంతో కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన సేవలకు గుర్తింపుగా పిహెచ్‌ఎల్ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు దీపక్ రాఠిను కోఆర్డినేటర్‌గా నియమించారు. అంతర్జాతీయ హ్యాండ్‌బాల్ సమాఖ్య, ఇతర దేశాల హ్యాండ్‌బాల్ సంఘాలతో సమన్వయం కోసం దీపక్ పనిచేస్తారు. కాగా, రణ్‌ధీర్ సింగ్ హ్యాండ్‌బాల్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్‌గా కొనసాగుతారు. ఈ ముగ్గురి నియామకాలను ధ్రువీకరిస్తూ భారత హ్యాండ్‌బాల్ సమాఖ్య శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇదిలావుండగా హ్యాండ్‌బాల్ ప్రీమియర్ లీగ్ పోటీలు మార్చి ఐదు నుంచి 25 వరకు రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరుగనున్నాయి. ఈ లీగ్‌లో తెలంగాణ టైగర్స్, ఢిల్లీ, చెన్నై, లక్నో, ముంబై, బెంగళూరు తదితర జట్లు తలపడనున్నాయి.

Jagan Mohan Rao as PHL chairman

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పిహెచ్‌ఎల్ చైర్మన్‌గా జగన్ మోహన్ రావు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: