16న ఒప్పో ఎఫ్15 లాంచ్

  మన తెలంగాణ/ హైదరాబాద్ : కొత్త సంవత్సరం(2020)లో ఒప్పో సరికొత్త ఫోన్ ఎఫ్15తో రానుంది. జనవరి 16న దేశంలో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఎఫ్ సిరీస్ ఫోన్లు ఎంతో ప్రజాధరణ పొందాయి. ఇప్పుడు ఈ సిరిసీలో ఎఫ్15ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. స్టైలిష్ లుక్ కల్గిన ఎఫ్15తో ఒప్పొ తన బ్రాండ్ విలువను మరింత పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఎఫ్11 ప్రో, ఎఫ్9 ప్రో వంటి స్మార్ట్‌ఫోన్లు అద్భుతమైన డిజైన్, కెమెరా […] The post 16న ఒప్పో ఎఫ్15 లాంచ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మన తెలంగాణ/ హైదరాబాద్ : కొత్త సంవత్సరం(2020)లో ఒప్పో సరికొత్త ఫోన్ ఎఫ్15తో రానుంది. జనవరి 16న దేశంలో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఎఫ్ సిరీస్ ఫోన్లు ఎంతో ప్రజాధరణ పొందాయి. ఇప్పుడు ఈ సిరిసీలో ఎఫ్15ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. స్టైలిష్ లుక్ కల్గిన ఎఫ్15తో ఒప్పొ తన బ్రాండ్ విలువను మరింత పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఎఫ్11 ప్రో, ఎఫ్9 ప్రో వంటి స్మార్ట్‌ఫోన్లు అద్భుతమైన డిజైన్, కెమెరా సామర్థం, అద్భుతమైన బ్యాటరీతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. వినియోగదారులకు అద్భుతమైన సేవలను అందించడంలో ఒప్పో ముందుంది.

కీలకమైన మార్కెట్‌గా హైదరాబాద్
2019 అక్టోబర్‌లో 12.4 శాతం మార్కెట్ వాటాతో హైదరాబాద్‌లో 57.01 వృద్ధిని సాధించింది. ఒప్పోకి హైదరాబాద్ కీలకమైన మార్కెట్‌గా మారింది. దక్షిణ భారత్‌లో కంపెనీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం లో ఇది ఎంతగానో దోహదం చేసింది. ఒప్పో తన మొదటి ఆర్ అండ్ డి డెవలప్‌మెంట్ సెంటర్‌ను హైదరాబాద్‌లో 2018 అక్టోబర్‌లో ప్రారంభించింది. మొదటి ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. అమ్మకాల తర్వాత సేవల కోసం ఒప్పో తెలంగాణలో 18 సేవా కేంద్రాలను కల్గి ఉంది. ఒక్క హైదరాబాద్‌లోనే 4 సెంటర్స్ ఉన్నాయి.

Oppo F15 to launch in India on January 16

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 16న ఒప్పో ఎఫ్15 లాంచ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.