ఐటిలో మేటి తెలంగాణ

  2013-14లో రూ. 52,258 కోట్లు ఉన్న ఎగుమతుల విలువని ఐదేండ్లలో డబుల్ చేసి చూపించిన కెటిఆర్ కార్యదీక్షతకు ప్రాంతాలకు అతీతంగా జన నీరాజనాలు లభిస్తున్నాయి. ఐటి రంగ ఎగుమతులు 2018-19 ఆర్ధిక సంవత్సరంలో 17% వృద్ధిని సాధించి లక్ష కోట్లకు చేరడం ఐటి రంగ అభివృద్ధి పట్ల మంత్రి కెటిఆర్‌కి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఐటిఐఆర్ ప్రాజెక్టు విషయంలో కేంద్రం మొండిచేయి చూపినప్పటికీ దానిని ఏ మాత్రం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఐటి […] The post ఐటిలో మేటి తెలంగాణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

2013-14లో రూ. 52,258 కోట్లు ఉన్న ఎగుమతుల విలువని ఐదేండ్లలో డబుల్ చేసి చూపించిన కెటిఆర్ కార్యదీక్షతకు ప్రాంతాలకు అతీతంగా జన నీరాజనాలు లభిస్తున్నాయి. ఐటి రంగ ఎగుమతులు 2018-19 ఆర్ధిక సంవత్సరంలో 17% వృద్ధిని సాధించి లక్ష కోట్లకు చేరడం ఐటి రంగ అభివృద్ధి పట్ల మంత్రి కెటిఆర్‌కి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఐటిఐఆర్ ప్రాజెక్టు విషయంలో కేంద్రం మొండిచేయి చూపినప్పటికీ దానిని ఏ మాత్రం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఐటి పురోగతిలో ముందుకు తీసుకు వెళ్తున్న సందర్భం అపూర్వం అనే చెప్పాలి.

కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో దేశంలోనే అగ్రపథంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో సమతుల్య అభివృద్ధి సాధించడానికి ఈ ఆరేళ్లలో ఎన్నో విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారు. గత పాలకుల మాదిరిగా కాకుండా అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని కెసిఆర్ ఆకాంక్ష. ఈ కోణంలోనే అనేక జిల్లాల పునర్విభజన ద్వారా 140 జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా విభజించి పారదర్శకతకు పెద్ద పీట వేయడం జరిగింది. అంతేకాదు అభివృద్ధి విషయంలో సైతం స్పష్టమైన కార్యాచరణతో, రాజీలేని ధోరణితో ప్రభుత్వం ముందుకు వెళుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో ఐటి రంగాన్ని కొత్తపుంతలు తొక్కించిన ఘనత మంత్రి కెటిఆర్‌కే దక్కుతుంది అని చెప్పడంలో ఎలాంటి భేషజాలు అవసరం లేదు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఐటి రంగంలో పెట్టుబడుల కోసం ఎన్నో అంతర్జాతీయ వేదికల మీద ఇక్కడ ఉన్న అవకాశాలను గురించి చర్చించడం జరిగింది. దాని ఫలితంగానే ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలు తమ వ్యాపార విస్తరణకు హైదరాబాద్ నగరాన్ని వేదిక చేసుకొన్నాయి. అమెజాన్, ఆపిల్, గూగుల్, ఫేస్ బుక్ వంటి సంస్థలు హైదరాబాద్ నగరానికి వచ్చేలా తెలంగాణ ఐటి పాలసీకి మంత్రి కెటిఆర్ రూపకల్పన చేయడం జరిగింది.

అంతటితో సంబరపడకుండా సిఎం కెసిఆర్ ఆశయాలకు అనుగుణంగా ఐటి అభివృద్ధిని కేవలం హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో కేవలం ఒక వైపు మాత్రమే విస్తరించిన అభివృద్ధి మంత్రి కెటిఆర్ ముందుచూపుతో నగరం నలువైపులా విస్తరించడం జరిగింది. ఫలితంగా దేశ వ్యాప్తంగా ఇబందులు ఎదుర్కొంటున్న రియాలిటీ రంగానికి హైదరాబాద్‌లో మాత్రం ఎదురులేకుండా పోయింది. 2013-14లో రూ.52,258 కోట్లు ఉన్న ఎగుమతుల విలువని ఐదేండ్లలో డబుల్ చేసి చూపించిన కెటిఆర్ కార్యదీక్షతకు ప్రాంతాలకు అతీతంగా జన నీరాజనాలు లభిస్తున్నాయి. ఐటి రంగ ఎగుమతులు 2018-19 ఆర్ధిక సంవత్సరంలో 17% వృద్ధిని సాధించి లక్ష కోట్లకు చేరడం ఐటి రంగ అభివృద్ధి పట్ల మంత్రి కెటిఆర్‌కి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

ఐటిఐఆర్ ప్రాజెక్టు విషయంలో కేంద్రం మొండిచేయి చూపినప్పటికీ దానిని ఏ మాత్రం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఐటి పురోగతిలో ముందుకు తీసుకు వెళ్తున్న సందర్భం అపూర్వం అనే చెప్పాలి. సమర్ధతకు మారుపేరుగా నిలిచి, తెలంగాణ యువతకు ఆదర్శంగా కెటిఆర్ ముందుకుపోతున్న తీరు తెలంగాణ రాష్ట్రానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచిపేరు తెచ్చిపెడుతోంది. విషయం మీద స్పష్టత, అభివృద్ధి పట్ల తనకున్న లోతైన అవగాహన, పెట్టుబడుల కోసం వివిధ కంపెనీలను మెప్పిస్తున్న తీరు తెలంగాణ రాష్ట్రానికి గొప్ప వరంగా చెప్పుకోవచ్చు. అధికారం అలంకారం కాదు, అది ఒక బాధ్యత అంటూ తెలంగాణ ఐటి పురోగతి విషయంలో నిబద్ధతతో మంత్రి కెటిఆర్ ముందుకు వెళ్తున్నతీరు ఆచరణీయం.

పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా పగ్గాలు చేపట్టినప్పటికీ ఇటు పార్టీని, అటు ఐటి రంగాన్ని ముందుకు నడిపిస్తున్న తీరు విమర్శకులను సైతం ప్రశంసించేలా చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఐటి రంగంలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించడానికి కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడుతున్న తీరు అద్భుతం. మరోవైపు తెలంగాణ ఐటి రంగ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ అవసరాలకు సరిపాల నాణ్యమైన మానవ వనరులను రూపొందించడానికి అవసరమైన చర్యలు సైతం తీసుకుంటున్నారు. టాస్క్, టి -హబ్ లాంటి వాటిని నెలకొల్పి ఒకవైపు మానవ వనరుల నాణ్యతను పెంచుతూ మరోవైపు యువత సృజనాత్మకతకు పెద్దపీట వేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఐటి విస్తరణ కోసం టిఆర్‌ఎస్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ జిల్లాలోని మడికొండ ఐటి పార్క్‌లో సైయెంట్, టెక్ మహీంద్రా క్యాంపస్‌లను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఇదే స్ఫూర్తితో అపారమైన మానవ వనరులు ఉన్న వరంగల్ జిల్లాకు పలు కంపెనీలు క్యూ కట్టడం తథ్యం. ఇది కేవలం వరంగల్ జిల్లాకు మాత్రమే కాకుండా అనేక జిల్లాల యువతకు ఉపాధికి పెద్ద భరోసా లభించినట్లు అయింది. తెలంగాణ వస్తే ఏమొచ్చింది అని అడిగిన వాళ్లు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సమతుల్య అభివృద్ధిని గమనించాలి అని నా విజ్ఞప్తి. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, ఐటి రంగ పితామహులుగా చెప్పుకునే నాయకులు ఇప్పటికయినా అభివృద్ధి అంటే ఏమిటో తెలుసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాను అభివృద్ధి చేయడానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధి ఆయా జిల్లాల్లో ఉన్న మౌలిక వనరుల పరంగా అభివృద్ధి చెందడం ద్వారా తెలంగాణ అభివృద్ధిలో దేశంలోనే మోడల్ రాష్ట్రంగా నిలవబోతున్నది అన్నది నిర్వివాదాంశం.

పాలకులు మనోళ్లు అయితే ప్రతి జిల్లా పచ్చబడుతది అన్న విషయం ఇప్పుడు అందరికీ అర్థమైన సత్యం. మన పాలనా, మన రాష్ట్రం అని నినదించి సాధించుకున్న రాష్ట్రానికి కెసిఆర్ నాయకత్వంలో అభివృద్ధిలో బలమైన పునాదులు పడ్డాయి. భవిష్యత్తులో తెలంగాణ ఎలాంటి ఆటంకాలు లేకుండా పురోగమించడానికి దిక్సూచిగా ప్రస్తుత టిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన నిలుస్తుంది అనవచ్చు. రాజకీయాలకు అతీతంగా ప్రజల మద్దతుతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్న తీరు ప్రశంసనీయం.

Telangana IT exports increase 17% in 2018-19

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఐటిలో మేటి తెలంగాణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: