కన్నకొడుకుని కడతేర్చిన కసాయి తల్లి

చింతకాని : మండల పరిధిలో ఓ కసాయి తల్లి కన్న కొడుకును కడతేర్చిన విషాద సంఘటన పందిళ్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తన శారీరక సుఖం కోసం కడుపున పుట్టిన కొడుకుని తన ప్రియుడితో కలిసి బండరాళ్లతో తీవ్రంగా కొటిట హతమార్చింది. పదిళ్లపల్లి గ్రామానికి చెందిన కాశిబోయిన ఆదిలక్ష్మి గత పది సంవత్సరాలుగా జగన్నాధపురం గ్రామానికి చెందిన కాసిమాల సుధాకర్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పరుచుకుందని, ఆమెకు కాశిబోయిన రాంబాబు (30) సంవత్సరాల […] The post కన్నకొడుకుని కడతేర్చిన కసాయి తల్లి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చింతకాని : మండల పరిధిలో ఓ కసాయి తల్లి కన్న కొడుకును కడతేర్చిన విషాద సంఘటన పందిళ్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తన శారీరక సుఖం కోసం కడుపున పుట్టిన కొడుకుని తన ప్రియుడితో కలిసి బండరాళ్లతో తీవ్రంగా కొటిట హతమార్చింది. పదిళ్లపల్లి గ్రామానికి చెందిన కాశిబోయిన ఆదిలక్ష్మి గత పది సంవత్సరాలుగా జగన్నాధపురం గ్రామానికి చెందిన కాసిమాల సుధాకర్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పరుచుకుందని, ఆమెకు కాశిబోయిన రాంబాబు (30) సంవత్సరాల కొడుకు ఉన్నాడు, అతను ప్రతి రోజు కూలీ పనులు చేసుకుంటూ తన తల్లి దగ్గరే జీవనం సాగిస్తున్నాడు.

తన తల్లి చేస్తున్న ఆక్రమ సంబంధ విషయమం తెలిసి తన తల్లిని పలు సందర్భాల్లో హెచ్చరించడంతో ప్రియుడు ఇచ్చిన సలహాతో ముందుగానే అనుకున్న పథకం ప్రకారం కాసిమాల సుధాకర్‌తో కలిసి ఆదిలక్ష్మి తన ఇంటిలో సోమవారం సాయంత్రం బండరాళ్లతో తన కొడుకుపై తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడితో రాంబాబు కేకలు వేయడంతో చుట్టు ప్రక్కల ఉన్నటువంటి స్థానికులు అక్కడకు చేరుకొని గాయాలతో పడిఉన్న రాంబాబును గ్రామస్థుల సహకారంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కన్నతల్లి తన శారీరక కోరికల కోసం ప్రియుడితో కలిసి కన్న కొడుకుని అతి దారుణంగా కొట్టి చంపడంతో గ్రామస్థలు ఆశ్చర్యపోయారు. విషయం తెలుసుకున్న సీఐ వంసత్‌కుమార్, ఎస్సై ఉమ నిందితున్ని పట్టుకొని కస్టడీలో ఉంచారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Mother Killed Son At Khammam District

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కన్నకొడుకుని కడతేర్చిన కసాయి తల్లి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: