పట్టుదలే పెట్టుబడి..

  క్రీడా పోటీలు అంటే మామూలు విషయం కాదు. దానికి ఎంతో కష్టపడాలి. అందులో నెగ్గాలి, సాధించాలంటే ఎంతో పట్టుదల ఉండాలి. అయితే ఫిలిప్పైన్స్‌లోని బలాసన్‌కు చెందిన రియా బుల్లోస్ అనే 11ఏళ్ల బాలిక మాత్రం పట్టుదలతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా ఫిలిప్పైన్స్‌లో ఇంటర్ స్కూల్ రన్నింగ్ పోటీలు జరిగాయి. రియా బుల్లోస్ కూడా ఆ పోటీల్లో పాల్గొనేందుకు పేరు ఇచ్చింది. కానీ అందులో పాల్గొనాలంటే షూ తప్పనిసరి. తనకు షూ కొనే స్తోమత […] The post పట్టుదలే పెట్టుబడి.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

క్రీడా పోటీలు అంటే మామూలు విషయం కాదు. దానికి ఎంతో కష్టపడాలి. అందులో నెగ్గాలి, సాధించాలంటే ఎంతో పట్టుదల ఉండాలి. అయితే ఫిలిప్పైన్స్‌లోని బలాసన్‌కు చెందిన రియా బుల్లోస్ అనే 11ఏళ్ల బాలిక మాత్రం పట్టుదలతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

తాజాగా ఫిలిప్పైన్స్‌లో ఇంటర్ స్కూల్ రన్నింగ్ పోటీలు జరిగాయి. రియా బుల్లోస్ కూడా ఆ పోటీల్లో పాల్గొనేందుకు పేరు ఇచ్చింది. కానీ అందులో పాల్గొనాలంటే షూ తప్పనిసరి. తనకు షూ కొనే స్తోమత కూడా లేకపోవడంతో ఆమె కాళ్లకు టేపులు చుట్టుకుని పోటీలో పాల్గొంది. అంతేకాదు వాటి మీద బ్రాండెడ్ సంస్థ ‘NIKE’ పేరు రాసుకుంది. టేపులు ధరించిన కాళ్లతోనే ఆ చిన్నారి 400 మీటర్లు, 800 మీటర్లు, 1500 మీటర్ల పోటీల్లో మొదటి స్థానంలో నిలిచి మూడు బంగారు పతకాలను సాధించింది.

దీంతో ఆమె కోచ్ ప్రిదిరిక్ ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజనులు ఆమె పట్టుదలకు ఫిదా అవుతున్నారు. అంతేకాదు నెటిజన్లు ఆ బాలికకు బూట్లు కొనించేందుకు అవసరమైన ఆర్థిక సాయం అందిస్తామంటూ ముందుకొచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న బాస్కెట్ బాల్ స్టోర్’ టైటాన్ 22’ సీఈఓ జెఫ్ కరియసో ఆమెతో మాట్లాడే అవకాశం కల్పించాలని కోరారు. అనంతరం ఆమెతో మాట్లాడిన ఆయన.. నీకు ఎస్‌ఎమ్ స్టోరులో అవసరమైన స్పోర్ట్ షూలు, సాక్స్, బ్యాగ్ తీసుకోమని తెలిపారు.

Rhea Bullos participated Running with taped legs

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పట్టుదలే పెట్టుబడి.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: