కేకుల ముచ్చట్లు

  క్రిస్మస్, న్యూఇయర్‌లు రానున్నాయి. ఈ రెంటికీ కేక్‌లు తప్పనిసరి. మధ్యలో పుట్టినరోజులు, పెళ్లిరోజులు… ఇలా సందర్భం ఏదైనా కేక్ ఉండాల్సిందే. ఇంట్లోనే తయారు చేసుకుని అందరికీ సర్వ్ చేస్తుంటే ఆ ఆనందమే వేరు. వెరైటీ కేక్‌ల తయారీ చూద్దాం.. చాక్‌లెట్ కప్ కేక్స్ కోకో పౌడర్ – అరకప్పు, కోడిగుడ్డు – ఒకటి, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్ – టీస్పూన్, పిండి – ఒకటిన్నర కప్పు, బేకింగ్ పౌడర్ – ఒకటిన్నర టీస్పూన్, బేకింగ్ సోడా – […] The post కేకుల ముచ్చట్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

క్రిస్మస్, న్యూఇయర్‌లు రానున్నాయి. ఈ రెంటికీ కేక్‌లు తప్పనిసరి. మధ్యలో పుట్టినరోజులు, పెళ్లిరోజులు… ఇలా సందర్భం ఏదైనా కేక్ ఉండాల్సిందే. ఇంట్లోనే తయారు చేసుకుని అందరికీ సర్వ్ చేస్తుంటే ఆ ఆనందమే వేరు.
వెరైటీ కేక్‌ల తయారీ చూద్దాం..

చాక్‌లెట్ కప్ కేక్స్

కోకో పౌడర్ – అరకప్పు, కోడిగుడ్డు – ఒకటి, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్ – టీస్పూన్, పిండి – ఒకటిన్నర కప్పు, బేకింగ్ పౌడర్ – ఒకటిన్నర టీస్పూన్, బేకింగ్ సోడా – ఒకటిన్నర టీస్పూన్, ఉప్పు – రుచికి తగినంత, వెన్న మూడు టేబుల్ స్పూన్లు, డార్క్ బ్రౌన్ షుగర్ – ముప్పా వు కప్పు, పాలు – పావు కప్పు, యాపిల్ సాస్ – పావుకప్పు, పంచదార – ఒకటి న్నర కప్పు, మఫిన్ కప్పులు – 12.

తయారీ విధానం
ముందుగా ఒకపాత్రలో పిండి తీసుకొని కోకో పౌడర్, సోడా, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి బాగా కలపాలి. మరొక పాత్రలో క్రీమ్, వెన్న, పంచదార తీసుకుని అన్ని పదార్థాలు కలిసేలా కలియబెట్టాలి. కోడిగుడ్డు కొట్టి ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. వెనీలా
వేసి కలుపుకోవాలి. రెండు మిశ్రమాలు కలపాలి. మిశ్రమాలు బాగా కలిసేందుకు పాలు పోయాలి. ఈ మిశ్రమాన్ని మఫిన్ కప్పులలో నింపాలి. ఓవెన్‌లో 20 నిమిషాల పాటు ఉంచాలి. ఓవెన్‌లో నుంచి తీశాక అరగంట పాటు చల్లార్చాలి. తరువాత సర్వ్ చేసుకోవాలి.

మిల్క్ కేక్

కావలసిన పదార్ధాలు: పంచదార- 4 కప్పులు, పాలు – 5 కప్పులు, బొంబాయి రవ్వ – ఒక కప్పు, నెయ్యి – 1. 1/2 కప్పు.

తయారీ విధానం: ముందుగా ఒక పాత్రలో పాలు పోసుకుని, అందులో బొంబాయి రవ్వ, పంచదార, నెయ్యి అన్నీ కలపాలి. పాత్రను స్టవ్‌పై ఉంచి, సన్నని సెగపై రవ్వ ఉడికి దగ్గరగా అయ్యేంతవరకూ గరిటతో తి ప్పుతూ ఉండాలి. అలా నెయ్యి పైకి తేలేంతవరకూ ఉడికించుకోవాలి. తరువాత నెయ్యి రాసిన ట్రేలో పోసి పైన జీడి పప్పు, కిస్‌మిస్ వేసి చల్లార్చాలి. ఆ పైన కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. అంతే మిల్క్ కేక్ స్వీట్ రెడీ టూ ఈట్ అంటూ నోరూరిస్తుంది మీకు.

మార్బుల్ కేక్

కావలసిన పదార్థాలు : మైదా- అర కప్పు, గుడ్లు- 2, చాక్లెట్ పొడి- 3 టీ స్పూన్లు, నెయ్యి- అర కప్పు, చక్కెర పొడి- ముప్పావు కప్పు, తినే సోడా- అర టీ స్పూను, వెనీలా ఎసెన్స్- అర టీ స్పూను.

తయారీ విధానం :చక్కెర పొడిలో నెయ్యి, గుడ్లు వేసి బాగా కలపాలి. తర్వాత మైదా, తినే సోడా కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెండు భాగాలుగా విడదీసి ఒక సగంలో చాక్లెట్ పొడి, మరో సగంలో వెనీలా ఎసెన్స్ వేసి కలుపుకోవాలి. బాణలి అడుగున కొద్దిగా నెయ్యి రాసి చాక్లెట్ పొడి కలిపిన మిశ్రమాన్ని ముందు వేయాలి. తర్వాత వెనీలా ఎసెన్స్ కలిపిన మిశ్రమం కూడా వేసి పైపైనే కలిపి కుక్కర్‌లో లేదా ఓవెన్‌లో 180 డిగ్రీ సెల్సియస్ వద్ద 45 నిమిషాలు ఉడికించాలి.

హనీ కేక్

కావలసిన పదార్థాలు : మైదా- ఒక కప్పు, చక్కెర పొడి- ఒక కప్పు, వెన్న లేదా నెయ్యి- 100 గ్రా॥, తినే సోడా- అర టీ స్పూను, గుడ్లు- 2, పాలు- 3 టేబుల్ స్పూన్లు, వెనీలా ఎసెన్స్- అర టేబుల్ స్పూను, తేనె- అర కప్పు, చక్కెర- 3 టేబుల్ స్పూన్లు, జామ్- 5 టేబుల్ స్పూన్లు, పచ్చికొబ్బరి తురుము- 2 టేబుల్ స్పూన్లు.

తయారీ విధానం: మైదా, చక్కెర పొడి, తినే సోడా, వెన్నె, గుడ్లు, పాలు, వెనీలా ఎసెన్స్‌లను బాగా గిలక్కొట్టుకుని ఓవెన్‌లో బేక్ చేయాలి లేదా కుక్కర్‌లో ఆరు విజిల్స్ వచ్చే దాకా ఉంచాలి. తర్వాత బయటికి తీసి చల్లారనివ్వాలి. ఒక గిన్నెలో తేనె, ఒక టేబుల్ స్పూను చక్కెర, అర కప్పు నీళ్లు పోసి కలుపుకుని కేక్ మీద సమానంగా పరవాలి. మిగిలిన చక్కెర జామ్‌లో వేసి చిన్న మంట మీద రెండు నిమిషాలు వేడిచేయాలి. తర్వాత కేక్ మీద సమానంగా రాసి, చివరగా కొబ్బరి తురుమును పైన చల్లాలి.

Making Variety Cakes

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కేకుల ముచ్చట్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.