అరక పట్టిన మంత్రి పువ్వాడ

  ఖమ్మం : జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఖమ్మం నియోజకవర్గం 7వ డివిజన్ అల్లిపురంలోని జోన్న చేనులో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అరక పట్టి పొలం దున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతు బతికితేనే రాజ్యం బతుకుతుందన్న ఆలోచనతో ముఖ్యమంత్రి కెసిఆర్ వారి సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని ఆయన చెప్పారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. 70 ఏళ్లు పాలన చేసిన వారు […] The post అరక పట్టిన మంత్రి పువ్వాడ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఖమ్మం : జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఖమ్మం నియోజకవర్గం 7వ డివిజన్ అల్లిపురంలోని జోన్న చేనులో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అరక పట్టి పొలం దున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతు బతికితేనే రాజ్యం బతుకుతుందన్న ఆలోచనతో ముఖ్యమంత్రి కెసిఆర్ వారి సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని ఆయన చెప్పారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

70 ఏళ్లు పాలన చేసిన వారు రైతులను విస్మరించారని, రైతులను గుర్తించింది కెసిఆర్ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. రైతుల కోసం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది టిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఆయన చెప్పారు. వరి ఉత్పత్తి రాష్ట్ర అవసరానికి మించి ఎక్కువ దిగుబడి వస్తుందని ఆయన చెప్పారు. రైతులు వాణిజ్య పంటల వైపు దృష్టి సారించాలని, సేంద్రియ వ్యవసాయం చేయాలని ఆయన సూచించారు.

Puvvada Ajaykumar Plowed the farm in Khammam

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అరక పట్టిన మంత్రి పువ్వాడ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.