వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం

కొండపాక: తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ద శైవ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లిఖార్జున స్వామి ఆలయంలో మూడు నెలల పాటు జరిగే జాతర ఉత్సవాలు ఆదివారం కల్యాణోత్సవంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్యహించి దృష్టి కుంభం నిర్వహించిన అనంతరం శ్రీ మల్లిఖార్జున స్వామి కల్యాణోత్సవం వీర శైవ ఆగమన శాస్త్ర ప్రకారం కన్నుల పండువగా జరిగింది. కోమురవెల్లిలోని తోట భావి వద్ద మల్లన్న కల్యాణ వేదిక ప్రాంగణాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. ఉదయమే […] The post వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కొండపాక: తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ద శైవ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లిఖార్జున స్వామి ఆలయంలో మూడు నెలల పాటు జరిగే జాతర ఉత్సవాలు ఆదివారం కల్యాణోత్సవంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్యహించి దృష్టి కుంభం నిర్వహించిన అనంతరం శ్రీ మల్లిఖార్జున స్వామి కల్యాణోత్సవం వీర శైవ ఆగమన శాస్త్ర ప్రకారం కన్నుల పండువగా జరిగింది. కోమురవెల్లిలోని తోట భావి వద్ద మల్లన్న కల్యాణ వేదిక ప్రాంగణాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. ఉదయమే ఆలయ గర్భగుడిలోని మూలవిరాట్టుకు కల్యాణం నిర్వహించారు.

అనంతరం స్వామి,అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేక పల్లకిలో ఊరేగింపుగా కోలాటాలు,పూజరుల వేద మంత్రాలు, భజనలు, మేళతాళలతో తోటబావి వద్ద ఉన్న కల్యాణ వేదికకు తీసుకొచ్చారు.ఈ ఏటా ప్రభుత్వం తరుపున రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, శాసనమండలి విప్,ఎంఎల్‌సి బోడకుంటి వెంకటేశ్వర్లు, జనగామ ఎంఎల్‌ఎ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిలు స్వామి , అమ్మవార్లకు పట్టువస్త్రాలు,ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. శైవ సంప్రదాయం ప్రకారం అమ్మవార్ల తరుపున మహదేవుని వంశస్తులైన మహదేవుని మల్లిఖార్జున్ దంపతులు,స్వామి వారి తరుపున పడిగన్నవారి వంశస్తులు ఆంజనేయులు దంపతులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు.

ఘనంగా కేతమ్మ,మేడలమ్మను వివాహమాడిన మల్లిఖార్జునుడు తర్వాత నూతనంగా తయారు చేయించిన రథంపై రాత్రి ఊరేగారు. శ్రీ మల్లిఖార్జున స్వామి కల్యాణోత్సవంతో మూడు నెలలుగా సాగే స్వామివారి మహోత్సవాలు ప్రథమ దర్శనంతో ప్రారంభమయ్యయి. శ్రీమత్ చెందిన శ్రీగురువు షట్ స్థల బ్రహ్మ శివానంద శివాచార్య స్వామీజీ పీఠాదిపతుల ఆధ్వర్యంలో కల్యాణోత్సవంతో పాటు వివిధ కార్యక్రమాలు జరిగాయి. కల్యాణాన్ని వీక్షించడానికి రాష్ట్ర నలు మూలల నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ఈ సందర్బంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మెన్ మేక సంతోష్ కుమార్ , ఇఒ వెంకటేష్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.

తెలంగాణ జాతర అంటేనే మల్లన్న జాతర…

మల్లిఖార్జున స్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్న అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ తెలంగాణలో జాతర అంటేనే కొమురవెల్లి మల్లన్న జాతర గుర్తుకు వస్తుందని, అలాంటి మల్లన్న జాతరలో భాగంగా జరిగిన కల్యాణోత్సవంలో పాల్గొనడంతో తన జన్మ ధన్యమైందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్ స్వయంగా ఆలయాన్ని సందర్శించి ఆలయ అభివృద్దికి కోట్లాది రూపాయలు మంజూరు చేశారన్నారు. మల్లన్న దయ వల్ల ఈ ప్రాంతం కరువు కాటకాలు తొలగి సస్యశ్యామలమైందన్నారు. మల్లన్న ఆలయంలో 30 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ది పనులు చేపట్టినట్టు తెలిపారు.

హాజరైన ప్రముఖులు …

మల్లన్న కల్యాణానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కార్పొరేషన్ చైర్మన్‌లు ఎర్రొల్ల శ్రీనివాస్, వంటేరు ప్రతాప్ రెడ్డి, జడ్పి చైర్ పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణ శర్మ,డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, డిఆర్వో చంద్రశేఖర్, ఎసిపి మహేందర్, తదితరులు పాల్గొని క ల్యాణాన్ని వీక్షించారు. మల్లిఖార్జున స్వామి కల్యాణం సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్‌డెవిస్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Komuravelli Mallikarjuna Swamy Kalyana Mahotsavam

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: