అంటార్కిటికా దిగువన బయటపడిన లోతైన లోయ (వీడియో)

కాలిఫోర్నియా : అంటార్కిటికా తాజా భౌగోళిక స్వరూప చిత్రాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. బెడ్‌మెషిన్ ప్రాజెక్టు దీన్ని అభివృద్ధి చేసింది. అంటార్కిటికా మంచు ఫలకాల అత్యంత స్పష్టమైన కొత్త మ్యాప్‌గా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఇర్విన్ లోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా తన అధికార ట్విట్టర్‌లో ఈమేరకు వివరించింది. అంటార్కిటికా మంచు ఫలకాల కింద ఎక్కువ లోతులో ఉన్న కచ్చితమైన భూభాగ ముద్దలను యుసిఐ గ్లేసియాలజిస్టుల బృందం వెలుగులోకి తెచ్చిందని వివరించింది. ఈ కొత్త పరిశోధన మంచుగడ్డ కట్టిన ఖండం […] The post అంటార్కిటికా దిగువన బయటపడిన లోతైన లోయ (వీడియో) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కాలిఫోర్నియా : అంటార్కిటికా తాజా భౌగోళిక స్వరూప చిత్రాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. బెడ్‌మెషిన్ ప్రాజెక్టు దీన్ని అభివృద్ధి చేసింది. అంటార్కిటికా మంచు ఫలకాల అత్యంత స్పష్టమైన కొత్త మ్యాప్‌గా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఇర్విన్ లోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా తన అధికార ట్విట్టర్‌లో ఈమేరకు వివరించింది. అంటార్కిటికా మంచు ఫలకాల కింద ఎక్కువ లోతులో ఉన్న కచ్చితమైన భూభాగ ముద్దలను యుసిఐ గ్లేసియాలజిస్టుల బృందం వెలుగులోకి తెచ్చిందని వివరించింది.

ఈ కొత్త పరిశోధన మంచుగడ్డ కట్టిన ఖండం పై వాతావరణ ప్రభావం ఎలా ఉంటుందో శాస్త్రవేత్తలు తెలుసుకోడానికి ఇది ఉపయోగపడుతుందని వెల్లడించింది. ఖండ భూభాగం లోని అత్యంత లోతైన ప్రదేశాన్ని పరిశోధకులు ఇప్పుడు కనుగొన్నారు. డెడ్‌సీ సముద్ర తీరంలో సముద్ర మట్టానికి దిగువన 413 మీటర్ల లోతులో అతి తక్కువ గాను, భూమి మీద సముద్ర మట్టానికి దిగువన 3500 మీటర్ల లోతులో ఈ ప్రదేశాన్ని కనుగొన్నారు ఏదెలాగున్నా ప్రపంచం మొత్తం మీద భూమిపై అత్యంత లోతైన లోయను తూర్పు అంటార్కిటికా లోని డెన్మాన్ హిమనీ నదం దిగువన కనుగొనడమైంది. ఇదివరకటి అధ్యయనాల ప్రకారం ఈ లోయ ఖాళీగా ఉండేదని అనుకుండేవారు.

కానీ ఈ కొత్త అధ్యయనం దాని వాస్తవ లోతు ఎంతో కనుగొన గలిగింది. దాగున్న ఈ లోయ లోతును నిండి ఉన్న మంచు గడ్డలు, ద్రవ్యరాశి సూత్రం ఆధారంగా గణించ గలిగారు. చివరకు బెడ్‌మెషిన్ అంటార్కిటికా మిశ్రమ దృశ్యాన్ని ఆవిష్కరించింది. కొన్ని ప్రాంతాల్లో మంచు వాగులు, వాటికి దిగువన భూభాగాలు, మిగతా చోట్ల కరిగిపోతున్న ఫలకాలు, ఇవన్నీ సముద్ర మంచుగడ్డలను అస్థిరంగా ఉంచుతున్నాయని కాలిఫోర్నియా యూనివర్శిటీ కి చెందిన మేథ్యూ మోర్లిఘెమ్ నివేదిక వెల్లడించింది.

Antarctic video reveals deepest canyon on Earth

Courtesy by Science Magazine

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అంటార్కిటికా దిగువన బయటపడిన లోతైన లోయ (వీడియో) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: