ఎరుపెక్కుతున్న పసుపు

బోర్డు ఏర్పాటులో మాట తప్పిన ఎంపిపై పసుపు రైతుల ఆగ్రహం, క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ మన తెలంగాణ/వేల్పూరు: జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని గత ఎన్నికలల్లో హామీ ఇచ్చి మాట తప్పిన ఎంపి ధర్మపురి అరవింద్ రైతులకు క్షమాపణలు చెప్పి వెంటనే తన ఎంపి పదవికి రాజీనామా చేయాలని జిల్లా ప సుపు బోర్డు సమన్వయ సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం వేల్పూరు మండలం ల క్కోర గ్రామంలో ఓ ఫంక్షన్‌హాల్‌లో […] The post ఎరుపెక్కుతున్న పసుపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
బోర్డు ఏర్పాటులో మాట తప్పిన ఎంపిపై పసుపు రైతుల ఆగ్రహం, క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్

మన తెలంగాణ/వేల్పూరు: జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని గత ఎన్నికలల్లో హామీ ఇచ్చి మాట తప్పిన ఎంపి ధర్మపురి అరవింద్ రైతులకు క్షమాపణలు చెప్పి వెంటనే తన ఎంపి పదవికి రాజీనామా చేయాలని జిల్లా ప సుపు బోర్డు సమన్వయ సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం వేల్పూరు మండలం ల క్కోర గ్రామంలో ఓ ఫంక్షన్‌హాల్‌లో నియోజకవర్గ పసుపు బోర్డు సమన్వయ సమితి సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో నియోజకవర్గ పసుపు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఈసందర్భంగా వారు మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో అరవింద్ పసుపు బోర్డు ఏర్పాటుకు కృషిచేస్తానని మాట ఇవ్వడంతోపాటు బాండ్ పేపర్ సైతం రాసి రైతులకు భరోసా ఇచ్చాడని తెలిపారు. రైతులకు మాట ఇచ్చిన ప్రకారం పసుపు బోర్డు ఏర్పాటులో ఎలాంటి చర్యలు చేపట్టడంలేదని, అంతేగాక రోజుకోరకంగా ప్రకటన చేస్తున్న ఎంపి పట్ల రైతుల్లో అసహనం వ్యక్తమవుతోందని అన్నారు. బాల్కొండ నియోజకవర్గ పసుపు పండించే రైతులు ఎక్కువగా ఉన్నారని, వారికి సరైన ధర లభించక పక్క రాష్ట్రం మహారాష్టకు వెళ్లి పసుపు విక్రయించవలసిన దుస్థితి నెలకొందని ఆవేదనవ్యక్తంచేశారు. చాలా మంది పసుపు పండించే రైతులు ఇక్కడ సరైన ధరలు లేక అనేక రకాలుగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ఎంపి అరవింద్ రైతులపట్ల కపట ప్రేమను మానుకోని సత్వరం పసుపు బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీని మరిచి ఎంపి కొత్త ఎత్తులు పసుపు బోర్డు ఏర్పాటు వ్యవహారంలో డొంకతిరుగుడుగా వ్యవహరిస్తున్నారని, రైతులను మభ్యపెడుతున్నారని పలువురు రైతులు విమర్శించారు. పసుపు బోర్డు ఏర్పాటు లక్షంగా పాద యాత్ర చేస్తామని, మళ్లీ రైతులను మభ్యపెట్టేందుకు ఎంపి సిద్దమవుతున్నారని , దీనిని రైతులంతా ఏకమై ధైర్యంగా తిప్పికొట్టాలని వారు పిలుపునిచ్చారు. పసుపు బోర్డు విషయంలో ధైర్యం ఉంటే ఎంపి తమతో కలసి వస్తే అందరి కలిసి పాదయాత్ర చేద్దామని చివరకు ఢిల్లీ వరకు సొంత ఖర్చులతో వెళదామని వారు ఈసందర్భంగా ఎంపికి సూచించారు.

నా లక్ష్యం పసుపు బోర్డు ఏర్పాటు అని చెప్పి ఎన్నికల్లో గెలిచిన ఎంపి అరవింద్ ఇప్పుడు బోర్డు ఏర్పాటు చేయడంలో ముఖం చాటేయడం సరికాదు. పసుపుబోర్డు ఏర్పాటు కోసం రాజీనామా చేసి వస్తే పార్టీలకతీతంగా పాదయాత్రకు మేమంతా సిద్దంగా ఉన్నాం. కొట్టాల చిన్నారెడ్డి, పసుపు రైతు, పడకల్

బాండ్ పేపర్ చూసి ఓట్లు వేసి పసుపు రైతులు తప్పు చేశారని, రైతులకు హామీ ఇచ్చి మాట తప్పిన ఎంపి ధర్మపురి అరవింద్ వెంటనే రాజీనామాచేసి రైతులకు క్షమాపణలు చెప్పాలని రైతులందరు డిమాండ్ చేస్తున్నారు.– బాలరాజ్, పసుపు రైతు, మోతె

Turmeric Farmers Fires on BJP MP Dharmapuri Arvind

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎరుపెక్కుతున్న పసుపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: