‘పౌరసత్వం’పై అవగాహనకు బిజెపి దేశవ్యాప్త ప్రచారం

  న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అది ముస్లింలు లేదా ఇతర మతస్థులపట్ల వివిక్ష చూపబోదని తెలిపేందుకు దేశవ్యాప్తంగా ప్రచారాన్ని చేపట్టబోతున్నట్టు బిజెపి ఆదివారం ప్రకటించింది. ‘ఈ చట్టంపై అవగాహన కలిగించేందుకు బిజెపి కార్యకర్తలు దేశవ్యాప్తంగా పర్యటిస్తారు. మతపరమైన హింసకు గురై పొరుగుదేశాల నుంచి వచ్చే మతపరమైన మైనారిటీలకు భారతదేశ పౌరసత్వం ఇవ్వడమే ఈ చట్టం ఉద్దేశమని వారు ప్రజలకు చెబుతారు. భారతదేశంలో నివసిస్తున్నముస్లిం సోదరసోదరీమణులకు చెందిన ఒక్క హక్కును కూడా […] The post ‘పౌరసత్వం’పై అవగాహనకు బిజెపి దేశవ్యాప్త ప్రచారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అది ముస్లింలు లేదా ఇతర మతస్థులపట్ల వివిక్ష చూపబోదని తెలిపేందుకు దేశవ్యాప్తంగా ప్రచారాన్ని చేపట్టబోతున్నట్టు బిజెపి ఆదివారం ప్రకటించింది. ‘ఈ చట్టంపై అవగాహన కలిగించేందుకు బిజెపి కార్యకర్తలు దేశవ్యాప్తంగా పర్యటిస్తారు. మతపరమైన హింసకు గురై పొరుగుదేశాల నుంచి వచ్చే మతపరమైన మైనారిటీలకు భారతదేశ పౌరసత్వం ఇవ్వడమే ఈ చట్టం ఉద్దేశమని వారు ప్రజలకు చెబుతారు. భారతదేశంలో నివసిస్తున్నముస్లిం సోదరసోదరీమణులకు చెందిన ఒక్క హక్కును కూడా హరించడం జరగదని కూడా వారు తెలియజేస్తారు. అంతేకాక, పొరుగుదేశాల్లో దేనికీ నోచుకోక, ఇక్కడికి వచ్చిన వారికి కూడా హక్కులు కల్పిస్తారు’ అని బిజెపి ప్రతినిధి సంబిత్ పాత్రా విలేకరుల సమావేశంలో చెప్పారు. పదకొండు రాష్ట్రాల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలకు బిజెపి జాతీయ నాయకత్వం పౌరసత్వ సవరణ చట్టంలోని అంశాల గురించి ఆదివారం వివరించింది.

BJP nationwide campaign to awareness on citizenship

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘పౌరసత్వం’పై అవగాహనకు బిజెపి దేశవ్యాప్త ప్రచారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: