‘పౌరసత్వ’ ఆందోళనల వెనక కాంగ్రెస్

  ఆ పార్టీ పాకిస్థాన్‌లా వ్యవహరిస్తోంది ప్రతిపక్షంపై విరుచుకుపడిన మోడీ మా నిర్ణయం 1000 శాతం కరెక్ట్ : ప్రధాని ధమ్కా (జార్ఖండ్) : పౌరసత్వ సవరణ చట్టం (సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ సిఎఎ) పై కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు లేనిపోని రగడ చేస్తున్నాయని, దేశంలో వివిధ ప్రాంతాల్లో దహనాలకు పాల్పడుతూ, అశాంతిని సృష్టిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోడీ విమర్శించారు. ‘ఆస్తుల్ని తగలబెడుతున్న వారిని టీవీలో చూడవచ్చని, వారు ధరించిన దుస్తుల్ని చూసి వారెవరూ గుర్తుపట్టవచ్చని ఆయన అన్నారు. […] The post ‘పౌరసత్వ’ ఆందోళనల వెనక కాంగ్రెస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆ పార్టీ పాకిస్థాన్‌లా వ్యవహరిస్తోంది
ప్రతిపక్షంపై విరుచుకుపడిన మోడీ
మా నిర్ణయం 1000 శాతం కరెక్ట్ : ప్రధాని

ధమ్కా (జార్ఖండ్) : పౌరసత్వ సవరణ చట్టం (సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ సిఎఎ) పై కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు లేనిపోని రగడ చేస్తున్నాయని, దేశంలో వివిధ ప్రాంతాల్లో దహనాలకు పాల్పడుతూ, అశాంతిని సృష్టిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోడీ విమర్శించారు. ‘ఆస్తుల్ని తగలబెడుతున్న వారిని టీవీలో చూడవచ్చని, వారు ధరించిన దుస్తుల్ని చూసి వారెవరూ గుర్తుపట్టవచ్చని ఆయన అన్నారు. హింసాత్మక ఆందోళనలకు ప్రతిపక్షం గట్టి మద్దతిస్తోందని మోడీ ఆరోపించారు. ‘కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పౌరసత్వ చట్టంపై మంటలు రాజేస్తున్నాయి. కానీ ఈశాన్య ప్రాంత ప్రజలు హింసను తిరస్కరించారు. కాంగ్రెస్ చర్యలు చూస్తుంటే పార్లమెంట్ తీనుకున్న నిర్ణయాలు కరెక్టేనని రుజువవుతున్నాయి’ అన్నారాయన. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ ధమ్కాలో ఒక ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు.

విదేశాల్లో కాంగ్రెస్ నిర్వహిస్తున్న ఆందోళనల్ని ఖండిస్తూ ప్రధాని ‘పాకిస్థాన్ ఎంతో కాలం నుంచి చేస్తున్నది కాంగ్రెస్ మొదటిసారి చేస్తోంది’ అని ఆరోపించారు. శనివారంనాడు లండన్‌లో ఇండియన్ హై కమిషన్ ముందు చాలామంది ప్రజలు గుమికూడి, పౌరసత్వ బిల్లుపై నిరసన తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టంపై పశ్చిమ బెంగాల్, అసోంలలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ చట్టం ప్రాముఖ్యతను మరోసారి తెలిపారు. పొరుగుదేశాల్లో మతహింసకు గురైన వారు భారతదేశ పౌరులుగా మారేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుందని ఇది 1000 శాతం సరైన నిర్ణయమని ఆయన అన్నారు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌లలో కష్టాలకు గురవుతున్న మైనారిటీలకు గౌరవాన్ని కల్పించేందుకు, వారి జీవితాలను మెరుగుపరిచేందుకు ఈ చట్టాన్ని తెచ్చామని మోడీ వివరించారు. ‘పౌరసత్వ చట్టానికి సంబంధించి మన పార్లమెంట్ గణనీయమైన మార్పు తెచ్చింది’ అన్నారు మోడీ.

PM Modi accuses congress of misleading country on CAB

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘పౌరసత్వ’ ఆందోళనల వెనక కాంగ్రెస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: