ఉల్లి పోయే మిర్చీ వచ్చె

క్వింటాల్ రూ. 13-14వేలు పలుకుతున్న మిరప మన తెలంగాణ/హైదరాబాద్ : ఉల్లి ధర దిగివచ్చేలోపు మరో పంట వంటింట్లో మంట పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈసారి రాష్ట్రంలో మిర్చి రేటు భారీగా పెరగనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా మిర్చి రేటు క్వింటాల్‌కు రూ.14 వేల వరకు పలకడమే ఇందుకు కారణం. సాధారణంగా మిర్చి క్వింటాల్‌కు రూ.6,500 ను ంచి రూ.7,000 వరకు పలుకుతుంది. అయి తే, ఈసారి క్వింటాల్ ధర రూ.13వేల నుంచి రూ.14వేల […] The post ఉల్లి పోయే మిర్చీ వచ్చె appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
క్వింటాల్ రూ. 13-14వేలు పలుకుతున్న మిరప

మన తెలంగాణ/హైదరాబాద్ : ఉల్లి ధర దిగివచ్చేలోపు మరో పంట వంటింట్లో మంట పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈసారి రాష్ట్రంలో మిర్చి రేటు భారీగా పెరగనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా మిర్చి రేటు క్వింటాల్‌కు రూ.14 వేల వరకు పలకడమే ఇందుకు కారణం. సాధారణంగా మిర్చి క్వింటాల్‌కు రూ.6,500 ను ంచి రూ.7,000 వరకు పలుకుతుంది. అయి తే, ఈసారి క్వింటాల్ ధర రూ.13వేల నుంచి రూ.14వేల వరకు పలుకుతోందని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. దీంతో సామాన్య ప్రజలు ఢీలా పడుతున్నారు. ఉల్లి అందుబాటులోకి వస్తుందిలే హమ్మయ్యా అనుకుంటున్న తరుణంలో మిర్చి రేటుకు రెక్కలు రావడమేమిటని అయోమయానికి గురవుతున్నారు. తరిగేటప్పుడు కంటే కొనేటప్పుడే కంటతడి పెట్టిస్తున్న ఉల్లి ధర తగ్గుముఖం పడుతున్నది.

కొన్ని చోట్ల నాణ్యమైన ఉల్లి ధర బాగానే ఉన్నా.. మరికొన్ని చోట్ల మాత్రం రూ.60కి కేజీ ఉల్లి లభిస్తోంది. దీంతో ప్రజలు కొంత ఊరట పొందుతున్నారు. రైతుబజార్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే ఉల్లి రూ.50కు లభిస్తున్నది. చిన్న ఉల్లిపాయలు కూడా కేజీకి రూ.50 నుంచి రూ.60కు వీధుల్లో బండ్ల మీద పెట్టి మరీ అమ్మకాలు జరుగుతున్నా యి. పరవాలేదు అనుకునేసరికి మరో నిత్యవసరంపై దరాఘాతం పడనుండ టం గమనార్హం. ఉల్లి కన్నా అసలైన ఘాటు కలిగించే మిర్చిపైనే ఈసారి రేటు పోటు పడనుంది. మలక్‌పేట, ఉస్మాన్‌గంజ్, బోయినపల్లి తదితర హైదరాబా ద్ హోల్‌సేల్ మార్కెట్‌లకు సాధారణంగా జనవరిలో మిర్చి పంట వస్తుంటుం ది. అయితే, ఈసారి ముందుగానే మిర్చి లారీలు మార్కెట్‌కు వస్తున్నాయి.

కానీ, ధర మాత్రం ఎక్కువగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. కొంతమంది వ్యాపారులు మిర్చిని అక్రమంగా నిల్వచేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని అందువల్లే మిర్చి ధర భారీగా పలుకుతోందని అంచనా వేస్తున్నారు. దీనిపై మార్కెట్‌యార్డ్‌ల అధికారులు సహకరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే మిర్చికున్న డిమాండ్ మేరకు రేటు పెరిగినట్లు దళారీలు చెబుతున్నారు. మిర్చి పంట సరిపడ అందుతున్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాలలో మిర్చి వాడకం అధికంగా ఉండటం వల్లే ధర పెరుగుతుందని పేర్కొంటున్నారు. చలికాలంలోనూ మిర్చి వాడకం సాధారణంగా ఎక్కువగానే ఉండటం కూడా మిర్చి పెరుగుదలకు కారణంగా భావిస్తున్నారు. అయితే, గతంలో లేనంతగా ఈసారి మిర్చి రైతులకు కూడా మంచి రేటు వస్తుండటం తో వారు కూడా ఆనందంలో ఉన్నారు. క్వింటాల్‌కు రూ.13వేల నుంచి రూ. 14వేల వరకు వస్తుండటంతో రైతులు కూడా భారీగా సరుకును మార్కెట్లకు తరలిస్తున్నారు.

Mirchi Price in Hyderabad Market

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఉల్లి పోయే మిర్చీ వచ్చె appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: