బడ్జెట్ కసరత్తులో నిర్మల బిజీబిజీ

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సూచనలున్నాయి. మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆమె ప్రవేశపెట్టబోతున్న రెండో బడ్జెట్ ఇది. బడ్జెట్‌కు ముందు జరిగే సంప్రదింపులు సోమవారం ప్రారంభమై డిసెంబర్  23న పూర్తవుతాయి. ఈ సంప్రదింపుల ప్రక్రియకు సీతారామన్ పారిశ్రామిక వ్యవస్థలు, రైతు సంఘాల వంటి సంబంధిత రంగాలు, ఆర్థికవేత్తల నుంచి సమాచారాన్ని కోరుతారని ఆర్థిక మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. ఆర్థిక వృద్ధి, వినియోగంలో పెంపుదల ఈ బడ్జెట్ […] The post బడ్జెట్ కసరత్తులో నిర్మల బిజీబిజీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సూచనలున్నాయి. మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆమె ప్రవేశపెట్టబోతున్న రెండో బడ్జెట్ ఇది. బడ్జెట్‌కు ముందు జరిగే సంప్రదింపులు సోమవారం ప్రారంభమై డిసెంబర్  23న పూర్తవుతాయి. ఈ సంప్రదింపుల ప్రక్రియకు సీతారామన్ పారిశ్రామిక వ్యవస్థలు, రైతు సంఘాల వంటి సంబంధిత రంగాలు, ఆర్థికవేత్తల నుంచి సమాచారాన్ని కోరుతారని ఆర్థిక మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి.

ఆర్థిక వృద్ధి, వినియోగంలో పెంపుదల ఈ బడ్జెట్ లక్ష్యాలు కావచ్చు. 2019 20 ద్వితీయార్థంలో ఆర్థికవృద్ధి ఆరేళ్ల కిందటి స్థితికి మందగించింది. 4.5 శాతానికి పడిపోయింది. వ్యాపారంలో సౌలభ్యత, ప్రైవేట్ పెట్టుబడులపై ప్రభావం చూపే నియంత్రిక వాతావరణం, ఎగుమతుల్లో పోటీ, చెల్లింపులు ఆలస్యం కావడం, కాంట్రాక్ట్ ఎన్‌ఫోర్స్‌మెం ట్, ప్రైవేట్ పెట్టుబడులు, పెరుగుదల వంటి అంశాలపై ప్రభుత్వం తమ అభిప్రాయాల్ని కోరవచ్చని పారిశ్రమిక వర్గాలు తెలిపాయి.

Nirmala Sitharaman To Hold Pre Budget Consultations

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బడ్జెట్ కసరత్తులో నిర్మల బిజీబిజీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: