‘నమామీ గంగా’ సమీక్ష

  ప్రధాని సారథ్యంలో మండలి భేటీ బోటులో మోడీ షికారు కాన్పూర్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన శనివారం ఇక్కడ జాతీయ గంగా నది మండలి సమావేశం జరిగింది. గంగానది కాలుష్య నివారణలో భాగంగా తలపెట్టిన నమామీ గంగా ప్రాజెక్టు అమలు గురించి ఇందులో సమీక్షించారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ జాతీయ మండలి తొలి భేటీ ఏర్పాటు అయింది. ప్రధాని, తరలివచ్చిన ఇతర ప్రముఖులకు ఇక్కడి ఛకేరీ విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ […] The post ‘నమామీ గంగా’ సమీక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రధాని సారథ్యంలో మండలి భేటీ
బోటులో మోడీ షికారు

కాన్పూర్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన శనివారం ఇక్కడ జాతీయ గంగా నది మండలి సమావేశం జరిగింది. గంగానది కాలుష్య నివారణలో భాగంగా తలపెట్టిన నమామీ గంగా ప్రాజెక్టు అమలు గురించి ఇందులో సమీక్షించారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ జాతీయ మండలి తొలి భేటీ ఏర్పాటు అయింది. ప్రధాని, తరలివచ్చిన ఇతర ప్రముఖులకు ఇక్కడి ఛకేరీ విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్వాగతం పలికారు. వారిని సమావేశ స్థలికి తీసుకువెళ్లారు. చంద్రశేఖర ఆజాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వేదికగా ఈ భేటీ జరిగింది. పవిత్రమైన గంగానదీ ప్రక్షాళన వేగవంతం గురించి ప్రధాని అక్కడికి వచ్చిన ప్రముఖులతో మాట్లాడారు. ఇప్పటివరకూ జరిగిన పనులు, ఇక ముందు చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి వారితో సమీక్షించారు.

ఈ సమీక్షా సమావేశానికి యుపి సిఎం ఆదిత్యానాథ్, ఉత్తరాఖండ్ సిఎం త్రివేంద్ర సింగ్ రావత్ కూడా వచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు కేంద్ర మం త్రులు ప్రకాశ్ జవదేకర్, గజేంద్ర సింగ్ షెకావత్, డాక్టర్ హర్షవర్థన్, ఆర్‌కె సింగ్, ప్రహ్లాద్ పటేల్, మన్‌సుఖ్ మందావియా, హర్దీప్ సింగ్ పూరి కూడా హాజరయ్యారు. దీనితో సమావేశంలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ అక్కడ ఏర్పాటు చేసిన నమామీ గంగా ప్రాజెక్టు మ్యూజియంను సందర్శించారు. గంగానదీ ప్రక్షాళనకు ఇప్పటివరకూ చేపట్టిన చర్యలను చిత్తరువులతో ఇక్కడ పొందుపర్చారు. తరువాత ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులతో కలిసి ప్రధాని మోడీ గంగా బ్యారేజ్ వద్ద ఉన్న అటల్ ఘాట్‌ను సందర్శించారు. ప్రాజెక్టు పరిధిలో చేపట్టిన కార్యక్రమాలను వారితో కలిసి సమీక్షించారు.

అరగంట సేపు గంగా నదిలో ప్రయాణం
ప్రధాని మోడీ తమ బృందంతో కలిసి పడవలో గంగానదిలో ప్రయాణం సాగించారు. దారిపొడవునా తీరం వెంబడి ఇరువైపులా నిలబడి ఉన్న ప్రజల వైపు చూస్తూ అభివాదం తెలిపారు. దీనితో ఈ ప్రాంతంలో కేరింతలతో సందడి నెలకొంది. ప్రధాని మోడీ అధ్యక్షతన తొలి జాతీయ గంగా మండలి సమావేశం జరుగుతుందని అంతకు ముందు ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీటు వెలువరించింది. గంగా పునరుజ్జీవం, పరిరక్షణ, నిర్వహణల లక్షంతో ఈ గంగా మండలి ఏర్పాటు అయిందని, తొలి భేటీకి ప్రాధాన్యత ఉందని ఇందులో వివరించారు.

PM Modi in Kanpur to chair National Ganga Council meet

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘నమామీ గంగా’ సమీక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: