రూ.4,724 కోట్లు సమీకరించిన పేటీఎం

న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎమ్ మరోసారి రూ.రూ.4,724 కోట్లు(66 కోట్ల డాలర్లు) నిధులు సమీకరించింది. చైనా అన్‌లైన్ దిగ్గజం అలీబాబాకు చెందిన అలీపేతో పాటు టి రొవె ప్రైస్ నిర్వహణలోని ఫండ్స్, సాఫ్ట్ బ్యాంక్‌కు చెందిన ఎస్‌వీఎఫ్ పాంథర్(కేమ్యాన్) ఈ పెట్టుబడులు పెట్టాయి. ఈ వివరాలను బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫార్మ్ టోఫ్లర్ వెల్లడించింది. ఈ విషయమై పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా ఈఏడాది నవంబర్‌లోనే పేటీఎమ్ సంస్థ అమెరికాకు […] The post రూ.4,724 కోట్లు సమీకరించిన పేటీఎం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎమ్ మరోసారి రూ.రూ.4,724 కోట్లు(66 కోట్ల డాలర్లు) నిధులు సమీకరించింది. చైనా అన్‌లైన్ దిగ్గజం అలీబాబాకు చెందిన అలీపేతో పాటు టి రొవె ప్రైస్ నిర్వహణలోని ఫండ్స్, సాఫ్ట్ బ్యాంక్‌కు చెందిన ఎస్‌వీఎఫ్ పాంథర్(కేమ్యాన్) ఈ పెట్టుబడులు పెట్టాయి. ఈ వివరాలను బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫార్మ్ టోఫ్లర్ వెల్లడించింది. ఈ విషయమై పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

కాగా ఈఏడాది నవంబర్‌లోనే పేటీఎమ్ సంస్థ అమెరికాకు చెదిన టి రొవె ప్రైస్, సాఫ్ట్‌బ్యాంక్, అలీబాబాల నుంచి రూ.7,000 కోట్ల మేర పెట్టుబడులు సమీకరించింది. వ్యాపార విస్తరణ కోసం మూడేళ్లలో రూ.10 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని పేర్కొంది. ఇటీవల పేటీఎం సంస్థకు నష్టాలు వచ్చాయి. 2 బిలియన్ డాలర్లు సేకరించే పనిలో ఉన్నామని ఇటీవల సంస్థ ప్రకటించింది. 2021 తర్వాత పబ్లిక్ లిస్టింగ్‌కు రానున్నట్టు కంపెనీ తెలిపింది.

Paytm Parent Raises Over Rs 4700 Cr

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రూ.4,724 కోట్లు సమీకరించిన పేటీఎం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: