మెట్రో రైలు ముందు దూకి భర్త , ఉరేసుకుని భార్య, కుమార్తె మృతి

నొయిడా : ఢిల్లీ లోని జవహర్‌లాల్ నెహ్రూ మెట్రో స్టేషన్ వద్ద శుక్రవారం ఉదయం 11.30 గంటలకు కదులుతున్న మెట్రో రైలు ముందు దూకి తీవ్రగాయాలతో 33 ఏళ్ల వ్యక్తి చనిపోగా, కొన్ని గంటలకు అతని భార్య, కుమార్తె ఇంటి లోని సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడు ఢిల్లీ లోని ప్రైవేట్ కంపెనీలో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. తమిళనాడు లోని నోలంబూర్‌కు చెందిన మృతుడు తన కుటుంబంతో నొయిడా సెక్టార్ 128 అపార్టుమెంటులో నాలుగు […] The post మెట్రో రైలు ముందు దూకి భర్త , ఉరేసుకుని భార్య, కుమార్తె మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నొయిడా : ఢిల్లీ లోని జవహర్‌లాల్ నెహ్రూ మెట్రో స్టేషన్ వద్ద శుక్రవారం ఉదయం 11.30 గంటలకు కదులుతున్న మెట్రో రైలు ముందు దూకి తీవ్రగాయాలతో 33 ఏళ్ల వ్యక్తి చనిపోగా, కొన్ని గంటలకు అతని భార్య, కుమార్తె ఇంటి లోని సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడు ఢిల్లీ లోని ప్రైవేట్ కంపెనీలో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. తమిళనాడు లోని నోలంబూర్‌కు చెందిన మృతుడు తన కుటుంబంతో నొయిడా సెక్టార్ 128 అపార్టుమెంటులో నాలుగు నెలల నుంచి ఉంటున్నాడు.

ఆయన భార్య(30), కుమార్తె (5) కొన్ని గంటల్లోనే ఆత్మహత్య చేసుకోవడం సంచలనం కలిగించింది. ఐదేళ్ల బాలిక కిండర్ గార్టెన్‌లో చదువుతోందని, భార్య గృహిణి అని పోలీసులు చెప్పారు. మొదట మృతుని దేహాన్ని పోస్టుమార్టమ్ కోసం ఢిల్లీ రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి పంపిన తరువాత ఆ విషయాన్ని ఇంటిలోని భార్యకు తెలియచేయగా, వారు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. మృతుని సోదరుడు కూడా ఈ కుటుంబంతో ఉంటున్నాడు. ఢిల్లీ లోని పైలట్ కోర్సులో శిక్షణ పొందుతున్నాడు.

Man Jumps in Front of Train in Noida

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మెట్రో రైలు ముందు దూకి భర్త , ఉరేసుకుని భార్య, కుమార్తె మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: