మైనర్‌పై అత్యాచారం.. నలుగురికి 30 ఏళ్లు జైలు శిక్ష

బిలాస్‌పూర్ : 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరిపిన కేసులో నలుగురు దోషులకు చత్తీస్‌గడ్ లోని బిలాస్‌పూర్ జిల్లా కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దోషులు చరణ్‌సింగ్ (30), ఈశ్వర్ ధుర్వ్ (31), నాగేశ్వర్ రజక్ (26),మనోజ్ వడేకర్ (35), లకు శుక్రవారం సెషన్స్ జడ్జి సంజీవ్ కుమార్ తమక్ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారని బాధితురాలి తరఫు న్యాయవాది ప్రియాంక శుక్లా వెల్లడించారు. 30 ఏళ్ల జైలు శిక్షతోపాటు దోషి చరణ్ […] The post మైనర్‌పై అత్యాచారం.. నలుగురికి 30 ఏళ్లు జైలు శిక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

బిలాస్‌పూర్ : 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరిపిన కేసులో నలుగురు దోషులకు చత్తీస్‌గడ్ లోని బిలాస్‌పూర్ జిల్లా కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దోషులు చరణ్‌సింగ్ (30), ఈశ్వర్ ధుర్వ్ (31), నాగేశ్వర్ రజక్ (26),మనోజ్ వడేకర్ (35), లకు శుక్రవారం సెషన్స్ జడ్జి సంజీవ్ కుమార్ తమక్ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారని బాధితురాలి తరఫు న్యాయవాది ప్రియాంక శుక్లా వెల్లడించారు. 30 ఏళ్ల జైలు శిక్షతోపాటు దోషి చరణ్ సింగ్‌కు 21,000 జరిమానా విధించగా, మిగతా ముగ్గురి దోషులకు ఒక్కొక్కరికి రూ.50,000 వంతున జరిమానా విధించారు.

టోర్వాకు చెందిన బాధితురాలు నిందితులపై 2017 ఫిబ్రవరి 20న ఫిర్యాదు చేసింది. 2015 నుంచి అదే పనిగా తనపై నిందితులు అత్యాచారం సాగించారని ఫిర్యాదులో పేర్కొంది. దేవ్రిఖుర్ద్ ఏరియాకు చెందిన నిందితులు బాధితురాలి అశ్లీల వీడియో చిత్రీకరించిన తరువాత ఆమెను బెదిరించి అత్యాచారం సాగించారు. నిందితులు ఆ ఏరియాలో అక్రమంగా లిక్కర్ అమ్ముతుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. టోర్వా పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేశారు.

Four sentenced to 30 years for raping minor

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మైనర్‌పై అత్యాచారం.. నలుగురికి 30 ఏళ్లు జైలు శిక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: