డిసెంబర్‌లో కార్లపై డిస్కౌంట్లు

హోండా కార్లపై రూ.5 లక్షల వరకు హుందయ్, ఇతర కార్లపై రూ.2 లక్షల వరకు న్యూఢిల్లీ: డిసెంబర్‌తో ఈ ఏడాది(2019) ముగియనున్న నేపథ్యంలో దేశీయ కారు తయారీ సంస్థలు భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఈనెలలో అన్ని ప్రధాన కంపెనీలు భారీగా తగ్గింపును ప్రకటించాయి. హుందయ్ ప్రస్తుతం మోడల్ ధారంగా రూ.2 లక్షల వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. మరోవైపు హోండా దేశవ్యాప్తంగా సంస్థ కార్లపై రూ.5 లక్షల వరకు తగ్గింపును ఇస్తోంది. దీంతో ఈ నెలలో కార్ల […] The post డిసెంబర్‌లో కార్లపై డిస్కౌంట్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హోండా కార్లపై రూ.5 లక్షల వరకు
హుందయ్, ఇతర కార్లపై రూ.2 లక్షల వరకు

న్యూఢిల్లీ: డిసెంబర్‌తో ఈ ఏడాది(2019) ముగియనున్న నేపథ్యంలో దేశీయ కారు తయారీ సంస్థలు భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఈనెలలో అన్ని ప్రధాన కంపెనీలు భారీగా తగ్గింపును ప్రకటించాయి. హుందయ్ ప్రస్తుతం మోడల్ ధారంగా రూ.2 లక్షల వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. మరోవైపు హోండా దేశవ్యాప్తంగా సంస్థ కార్లపై రూ.5 లక్షల వరకు తగ్గింపును ఇస్తోంది. దీంతో ఈ నెలలో కార్ల విక్రయాలు జోరందుకున్నాయి.

కంపెనీలు కార్లపై 5- నుంచి 15 శాతం మధ్య డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. కొత్త ఉద్గార నిబంధనలు అమల్లోకి రానున్న సందర్భంగా ఇప్పటికే ఉత్పత్తి చేసిన బిఎస్4 వాహనాలను పూర్తిగా వదిలించుకునే యత్నంలో భాగంగా కార్ల కంపెనీలు ఈ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. డిసెంబర్‌తో కంపెనీల ఆఫర్లు ముగియవచ్చని, జనవరి నుంచి అన్ని కంపెనీల ధరలు పెంచవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అందువల్ల కొత్త వాహనాలు కొనాలనుకునే వారికి ఈ నెల సరైందని వారు పేర్కొంటున్నారు. బిఎస్4 స్టాక్ మొత్తాన్ని విక్రయించామని, ప్రస్తుతం డిస్కౌంట్స్ భారీగా ఇస్తున్నామని, నెల ముగిస్తే ఇవేవి ఉండవని ఓ సంస్థ ప్రతినిధి తెలిపారు. జనవరి నుంచి ధరలు పెరుగుతాయని అన్నారు.

సాధారణంగా ప్రతి డిసెంబర్‌లో ఆటో కంపెనీలు డిస్కౌంట్లు ఇస్తుంటాయి. అయితే ఈసారి ఈ డిస్కౌంట్లు ఊహించని విధంగా ఉన్నాయి. గతేడాది మొత్తం ఆటోవిక్రయాల్లో డిసెంబర్ విక్రయాల వాటా 8 శాతంగా నమోదయింది. ప్రస్తుతం మారుతీ తన వాహనాలపై రూ.3,7-89వేల మేర డిస్కౌంట్ ఇస్తోంది. అలాగే హుందాయ్ రూ. 20000 నుంచి రూ.2 లక్షల వరకు, టాటా మోటర్స్ రూ. 77500 నుంచి రూ. 2.25 లక్షల మేర డిస్కౌంట్స్ ఇస్తోంది. ఈ ఏడాదిలో ఆటో కంపెనీలు ఇచ్చిన డిస్కౌంట్లలో ప్రస్తుతం ఇస్తున్నవే చాలా ఎక్కువ డిస్కౌంట్లని హుందాయ్ మోటర్స్ తెలిపింది.

అయితే ఇప్పటికీ పలువురు కొనుగోలుదార్లు మరికొంత కాలం వేచిచూడాలని భావిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. టూవీలర్స్ విభాగంలో 2017లో ఉద్గార నిబంధనల మార్పు సందర్భంగా వచ్చినట్లే కార్ల విక్రయాల్లోనూ భారీ ఆఫర్లు వస్తాయని భావిస్తున్నారు. వచ్చే ఏప్రిల్‌లో భారీ ఆఫర్లు ఉండొచ్చని కొందరి ఆలోచనగా ఉంది. అయితే ఇప్పటికే చాలా కార్ల కంపెనీలు తమ బిఎస్4 నిల్వలు తగ్గించుకున్నాయని, టూవీలర్ వంటి భారీ సేల్ కార్లలో ఉండకపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

Discounts of up to Rs 5 Lakhs on Honda Cars

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post డిసెంబర్‌లో కార్లపై డిస్కౌంట్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: