సిఎం ఆదేశాలను అధికారులు అమలు చేయడం లేదు

  హైదరాబాద్: మహిళల డ్యూటీల విషయంలో సిఎం కెసిఆర్ ఆదేశాలను అధికారులు సరిగ్గా అమలుచేయడం లేదని ఆర్‌టిసి జెఎసి కన్వీనర్ అశ్వత్థామరెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం విద్యానగర్‌లోని ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యదేశంలో ట్రేడ్ యూనియన్‌లు ఉండాలని, అదేవిధంగా ఎన్నికలు జరపాల్సిందేనని పేర్కొన్నారు. యూనియన్లకు సంబంధించి రహస్య ఓటింగ్ పెట్టాలని, మెజారిటీ కార్మికుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బెంగళూర్‌లో 7వేల బస్సులు ఉన్నాయని, హైదరాబాద్‌లో 3,500 బస్సుల్లో వెయ్యి బస్సులు […] The post సిఎం ఆదేశాలను అధికారులు అమలు చేయడం లేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: మహిళల డ్యూటీల విషయంలో సిఎం కెసిఆర్ ఆదేశాలను అధికారులు సరిగ్గా అమలుచేయడం లేదని ఆర్‌టిసి జెఎసి కన్వీనర్ అశ్వత్థామరెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం విద్యానగర్‌లోని ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యదేశంలో ట్రేడ్ యూనియన్‌లు ఉండాలని, అదేవిధంగా ఎన్నికలు జరపాల్సిందేనని పేర్కొన్నారు. యూనియన్లకు సంబంధించి రహస్య ఓటింగ్ పెట్టాలని, మెజారిటీ కార్మికుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బెంగళూర్‌లో 7వేల బస్సులు ఉన్నాయని, హైదరాబాద్‌లో 3,500 బస్సుల్లో వెయ్యి బస్సులు రద్దు చేస్తున్నారని అశ్వత్థామరెడ్డి విమర్శించారు. బస్సులను కుదించడం వల్ల ఆదాయం వస్తుందేమో కానీ..ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు తప్పడంలేదన్నారు.

చట్ట వ్యతిరేకంగా కేటాయించే డ్యూటీల్ని ఎత్తివేయాలని, లేనిపక్షంలో కార్మికశాఖకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. చట్ట వ్యతిరేకంగా కేటాయించే డ్యూటీలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సమ్మె కాలంలో కొందరు అధికారులు అధికారులు నిధులు దుర్వినియోగం చేశారని..వారిపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సంక్షేమ కౌన్సిల్‌లో సభ్యులను ఏ ప్రాతిపదికన తీసుకున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పదవీవిమరణ వయస్సు 60 ఏళ్లకు వద్దన్నారు. కోరుకున్న వాళ్లకు మాత్రమే అలా ఇవ్వాలంటూ చెప్పుకొచ్చారు. కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో సిఎం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పేర్కొన్నారు. ఎన్నికలు జరిగేవరకు ప్రస్తుత గుర్తింపు సంఘాలను గుర్తించాలని అశ్వత్థామరెడ్డి తెలియజేశారు.

Ashwathama Reddy Press Meet on RTC womens duties

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సిఎం ఆదేశాలను అధికారులు అమలు చేయడం లేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: