మేం చెప్పేంతవరకు మృతదేహాలను భద్రపరచండి

  అప్పగింతపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు దిశ నిందితుల మృతదేహాల విషయమై సందిగ్ధతకు తెరదించిన సుప్రీం కోర్టు మన తెలంగాణ/హైదరాబాద్ : దిశ హత్య కేసు నిందితుల మృతదేహాలు భద్రపరచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు మృతదేహాలు భద్రతపరచాలని, మృతదేహాల అప్పగింతపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించింది. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది. మృతదేహాల అప్పగింతపై తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాదులు ధర్మాసనం […] The post మేం చెప్పేంతవరకు మృతదేహాలను భద్రపరచండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అప్పగింతపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు
దిశ నిందితుల మృతదేహాల విషయమై సందిగ్ధతకు తెరదించిన సుప్రీం కోర్టు

మన తెలంగాణ/హైదరాబాద్ : దిశ హత్య కేసు నిందితుల మృతదేహాలు భద్రపరచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు మృతదేహాలు భద్రతపరచాలని, మృతదేహాల అప్పగింతపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించింది. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది. మృతదేహాల అప్పగింతపై తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాదులు ధర్మాసనం దృష్టకి తేవడంతో ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

మృతదేహాలు అప్పగించాలన్న పిటిషన్‌పై శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో సందిగ్ధతకు తెరపడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు జరిపేందుకు సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వీఎస్ సిర్పుర్కర్ నేతృత్వంలోని ఈ కమిషన్‌లో బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖ, సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ సభ్యులుగా ఉన్నారు.

SC orders bodies of disha accused to be preserved

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మేం చెప్పేంతవరకు మృతదేహాలను భద్రపరచండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: