పురుగుల మందు తాగి జంట ఆత్మహత్య

కేసు నమోదు చేసిన పోలీసులు సిద్దిపేట : పురుగుల మందు తాగి జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన చెర్యాల మండలంలోని వీరన్నపేట గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా మద్దురూ మండలంలోని కూటిగల్‌కు చెందిన యువతి(27) ని ఏడు సంవత్సరాల క్రితం వీరన్నపేటకు చెందిన ప్రభాకర్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఈ నేపథ్యంలో వారి దాంపత్యం కొనసాగుతున్న క్రమంలో వరుసకు మరిది అయిన రామకృష్ణ(21)తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు […] The post పురుగుల మందు తాగి జంట ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
కేసు నమోదు చేసిన పోలీసులు

సిద్దిపేట : పురుగుల మందు తాగి జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన చెర్యాల మండలంలోని వీరన్నపేట గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా మద్దురూ మండలంలోని కూటిగల్‌కు చెందిన యువతి(27) ని ఏడు సంవత్సరాల క్రితం వీరన్నపేటకు చెందిన ప్రభాకర్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఈ నేపథ్యంలో వారి దాంపత్యం కొనసాగుతున్న క్రమంలో వరుసకు మరిది అయిన రామకృష్ణ(21)తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు , ఈ వ్యవహారంపై రెండు నెలల క్రితం పెద్దలు పంచాయితీ పెట్టి మాట్లాడినట్లు తెలిసింది. అనంతరం యువతి, ప్రభాకర్ ల దాంపత్యం సాఫీగా సాగింది. గురువారం వివాహిత, రామకృష్ణలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనాస్థలిని ఎస్సై మోహన్‌బాబు తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Couple Commits Suicide At Siddipet

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పురుగుల మందు తాగి జంట ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: