రొమాంటిక్ లుక్

  క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ నిర్మిస్తోన్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాను ఫిబ్రవరి 14న విడుదల చేస్తున్నారు. ప్రణాళిక ప్రకారం చిత్ర యూనిట్ భారీ ప్రమోషన్లను ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఈ సినిమాలో నటిస్తున్న నలుగురు హీరోయిన్లలో ఒక్కొక్కరి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తున్నారు. ఇందులో హీరోతో ఆ నలుగురు హీరోయిన్లకు […] The post రొమాంటిక్ లుక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ నిర్మిస్తోన్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాను ఫిబ్రవరి 14న విడుదల చేస్తున్నారు. ప్రణాళిక ప్రకారం చిత్ర యూనిట్ భారీ ప్రమోషన్లను ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఈ సినిమాలో నటిస్తున్న నలుగురు హీరోయిన్లలో ఒక్కొక్కరి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తున్నారు. ఇందులో హీరోతో ఆ నలుగురు హీరోయిన్లకు ఉన్న సంబంధాన్ని తెలియజేస్తారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ పాత్ర పేరు శీనయ్య.

అతని భార్య సువర్ణ పాత్రలో ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. వీరిద్దరూ వంటింట్లో ఉన్న రొమాంటిక్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో విజయ్ దేవరకొండ యంగ్ లుక్‌లో కనపడుతుంటే… ఐశ్వర్యా రాజేష్ హోమ్లీ లుక్‌లో కనపడుతోంది. అలాగే శుక్రవారం ఇజాబెల్లా, శనివారం క్యాథరిన్, ఆదివారం రాశిఖన్నాలకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్లను విడుదల చేయబోతున్నారు. సినిమా టీజర్‌ను జనవరి 3న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతంః గోపీసుందర్, సినిమాటోగ్రఫీః జయకృష్ణ గుమ్మడి.

World Famous Lover film will be released on 14 February

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రొమాంటిక్ లుక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: